కువైట్ లో సినిమాలు తీసేవారిని ప్రోత్సహిస్తున్న యునైటెడ్ తెలుగు ఫోరమ్

- June 17, 2023 , by Maagulf
కువైట్ లో సినిమాలు తీసేవారిని ప్రోత్సహిస్తున్న యునైటెడ్ తెలుగు ఫోరమ్

కువైట్ సిటీ: కువైట్ లో సినిమాలు చేయాలనుకునే వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో యునైటెడ్ తెలుగు ఫోరమ్ మరియు తెలుగు ఆరబ్స్ సంయుక్తంగా మొదటి 2022-23 లఘు చిత్రాల పోటీ కార్యక్రమం నిర్వహించింది.

ఉత్తమ ఎడిటర్: నాని (ఇదీ కథ)

ఉత్తమ ఫోటోగ్రఫీ : సుబ్బు (పసి  ప్రాణం)

ఉత్తమ భావవ్యక్తీకరణ : మాస్ మస్తాన్ ( బ్లైండ్ మైండ్ ) 

ఉత్తమ కథ : భువనేశ్వరి (పసి  ప్రాణం)

ఉత్తమ హీరోయిన్  : సంజు (శ్రీ)

హీరోయిన్ ప్రత్యేక ప్రస్తావన: రాణి (పసి  ప్రాణం)

ఉత్తమ హీరో : హైదర్ (మనీ)

ఉత్తమ దర్శకులు : సుభాన్ (ఇదీ కథ)

ఉత్తమ చిత్రం : మల్లిఖార్జున (పసి  ప్రాణం)

పోటీలో పాల్గొన్న దర్శకలు అందరినీ ప్రతేక జ్ఞాపికతో  వెంకట్ కోడూరి సత్కరించారు 

ఈ సందర్భంగా UTF అధ్యక్షులు వెంకట్ కోడూరి మాట్లాడుతూ సినిమా రంగం కేవలం సృజనాత్మక, వినోద రంగాలలోనే  కాకుండా సమాజాన్ని ప్రభావితం చేసే ఎన్నో సినిమాలు  రావాలని పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమం విజయవంతం చేయటానికి కృషి చేసిన మున్నా సయ్యద్, రాజి ఖాన్, షరీఫ్, రాము, ముజీర్, ఉదయ్ లకు ప్రత్యేక ధన్యధములు తెలియచేసారు 

ఈ కార్యక్రమంలో గిరి ప్రసాద్, విజయ  భాస్కర్,  జిలకర  మురళి, మల్లి మారోతు, ముస్తాక్ ఖాన్, అర్షద్, ఇమ్రాన్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com