ఎయిర్‌బ‌స్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల‌ను కొనుగోలు చేయ‌నున్న ఇండిగో ఎయిర్లైన్స్

- June 19, 2023 , by Maagulf
ఎయిర్‌బ‌స్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల‌ను కొనుగోలు చేయ‌నున్న ఇండిగో ఎయిర్లైన్స్

న్యూఢిల్లీ: ప్రైవేట్ విమాన‌యాన సంస్ధ ఇండిగో 500 ఎయిర్‌బ‌స్ ఏ320 ఎయిర్‌క్రాఫ్ట్‌ల‌ను కొనుగోలు చేయ‌నుంది. ఇది విమాన‌యాన చ‌రిత్ర‌లో అతిపెద్ద ఒప్పందంగా మెగా ఏవియేషన్ డీల్ నిల‌వ‌నుంది. 5500 కోట్ల డాల‌ర్ల విలువైన ఈ ఒప్పందం పౌర విమానయాన రంగంలో అతిపెద్ద ఆర్డ‌ర్‌గా న‌మోదైంది. ఇండిగో చీఫ్ పీట‌ర్ ఎల్బ‌ర్స్ ఈ చారిత్రాత్మ‌క డీల్ వివ‌రాల‌ను సోమ‌వారం ప్ర‌క‌టించారు.

గ‌త కొద్దిరోజులుగా ఈ భారీ డీల్‌పై ఎయిర్‌బ‌స్‌, ఇండిగో జ‌రుపుతున్న చ‌ర్చ‌లు ఫ‌ల‌వంత‌మ‌య్యాయి. ఇండిగో డీల్‌తో పాటు ఎయిర్‌బ‌స్ సౌదీ ఎయిర్‌లైన‌ర్ ఫ్లైనాస్ కోతో కూడా ప్ర‌తిష్టాత్మ‌క ఒప్పందాన్ని ఖ‌రారు చేసేందుకు క‌స‌ర‌త్తు సాగిస్తోంద‌ని బ్లూమ్‌బ‌ర్గ్ న్యూస్ వెల్ల‌డించింది.

కాగా, ఈ ఒప్పందాల‌కు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న‌ల‌ను అందించేందుకు ఎయిర్‌బ‌స్‌, ఇండిగో, ఫ్లైనాస్ ప్ర‌తినిధులు నిరాక‌రించారు. ఇండిగో, ఎయిర్‌బ‌స్ భారీ ఒప్పందానికి సంబంధించి పూర్తి వివ‌రాలు వెలుగుచూడాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com