ప్రభాస్ ఎక్కడా.? ఏం చేస్తున్నాడు.?

- June 20, 2023 , by Maagulf
ప్రభాస్ ఎక్కడా.? ఏం చేస్తున్నాడు.?

ప్రభాస్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం అవ్వాల్సింది ‘ఆదిపురుష్’. ఈ జనరేషన్‌కి రామాయణం యొక్క ప్రాశస్థ్యాన్ని ట్రెండీగా చెప్పాలన్న వుద్దేశ్యంతో తెరకెక్కిన సినిమా ‘అదిపురుష్’.

కానీ, ట్రెండీ టెల్లింగ్ పేరుతో ఇతిహాసాన్ని వక్రీకరించేశారు. దాంతో, విమర్శల పాలైపోయారు ‘ఆదిపురుష్’ టీమ్. ఒక ఎపిక్‌ని టచ్ చేసినప్పుడు అంత ఒళ్లూ పై తెలియకుండా వ్యవహరిస్తారా.? ఇంతలా దిగజారిపోతారా.? అంటూ ‘ఆదిపురుష్’ రిలీజ్ తర్వాత అందరి నోటి వెంట వచ్చిన మాటలివే.!

అంతా అయిపోయింది. సినిమా వచ్చింది. పోయింది. మరి, ప్రభాస్ సంగతేంటీ.? సినిమా విషయంలో ఇంత రచ్చ జరుగుతోంది కదా.. ప్రభాస్ ఎక్కడున్నాడు.? అప్పుడెప్పుడో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కనిపించాడంతే. 

మళ్లీ కనిపించలేదింతవరకూ. ఇంత రచ్చ జరుగుతున్నప్పుడు ఎక్కడో చోట.. ఏదో ఒక విధంగా తనదైన స్పందన వినిపించాలి కదా.. అటు చూస్తే బాలీవుడ్ మీడియా ప్రభాస్ మీద గుర్రుమంటోందట. 

సినిమాని ప్రమోట్ చేసుకోవాల్సిన బాధ్యత లేదా.? అని గుస్సా అవుతోందట. నిర్మాతలిదీ ప్రభాస్ పట్ల ఇదే తీరు అని తెలుస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com