ఆ డైరెక్టర్‌తో నాని ఇంకోస్సారి.! ఈ సారి పక్కా హిట్టే మరి.!

- June 21, 2023 , by Maagulf
ఆ డైరెక్టర్‌తో నాని ఇంకోస్సారి.! ఈ సారి పక్కా హిట్టే మరి.!

విలక్షణ దర్శకుడిగా పేరున్న వివేక్ ఆత్రేయతో నేచురల్ స్టార్ నాని గతంలో ‘అంటే సుందరానికి’ సినిమా చేశాడు. ఆ సినిమాకి రిలీజ్ ముందు హైప్ తప్ప, సినిమాలో విషయం లేదని ఫ్లాప్ లిస్టులో పడేశారు ప్రేక్షక దేవుళ్లు.

అయితే, ఇంకోసారి ఈ కాంబో రిపీట్ కాబోతోందనీ తాజా సమాచారం. ఈ సారి నానితో ఓ డార్క్ ధ్రిల్లర్ మూవీని ప్లాన్ చేశాడట వివేక్ ఆత్రేయ. ‘దసరా’ సినిమాతో సూపర్ హిట్టు కొట్టి ఫుల్ జోష్ మీదున్నాడు నాని.

ఇదే జోష్‌లో వివేక్ తెచ్చిన కథ నచ్చడంతో వెంటనే ఓకే చేసేశాడట. ఈ సినిమాని నిర్మించేందుకు మైత్రీ మూవీస్ మేకర్స్ ముందుకు రావడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. 

‘దసరా’తో నాని మార్కెట్ బాగా పెరిగిపోయింది. ఆ మార్కెట్‌కి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాని నిర్మించబోతున్నారనీ ప్రచారం జరుగుతోంది. అయితే, డీవీవీ దానయ్య పేరు కూడా ఈ సినిమాని నిర్మించాలనుకుంటున్నారనీ తెలుస్తోంది. 

చూస్తుంటే, నాని మార్కెట్ గురించే ఈ పోటీ నెలకొందో లేక, కథలోనే అంత పవర్ వుందో తెలీదు కానీ, రెండు బడా నిర్మాతల సంస్థలు ఈ ప్రాజెక్ట్ కోసం పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది. లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్స్ హ్యప్‌నింగ్.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com