కొల్లూరులో డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించిన సిఎం కెసిఆర్
- June 22, 2023
హైదరాబాద్: సిఎం కెసిఆర్ సంగారెడ్డి జిల్లా కొల్లూరులో రెండో దశ కింద చేపట్టిన కెసిఆర్ నగర్ 2 బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్ కాలనీని ప్రారంభించారు. ఆరుగురు లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. అంతకుముందు డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కెటిఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
సుమారు 60 వేల మంది ఆవాసం ఉండేలా ఒకేచోట ఏకంగా 15,660 ఇండ్ల నిర్మాణాన్ని తెలంగాణ సర్కారు చేపట్టింది. నిరుపేదల కోసం సకల సౌకర్యాలతో కొల్లూరులో ఈ ఆదర్శ టౌన్‌షిప్‌ను నిర్మించింది. నాణ్యతలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కార్పొరేట్ హంగులతో పేదల కోసం కలల సౌధాలను నిర్మించింది. రూ.1,489.29 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టులో కార్పొరేట్ అపార్ట్మెంట్లకు తీసిపోకుండా సకల హంగులతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించారు.
తాజా వార్తలు
- తాజా పరిణామాలపై అమీర్, యూఏఈ అధ్యక్షుడు చర్చలు..!!
- ఎక్సెప్షనల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీకి గైడ్ లైన్స్..!!
- యూఏఈలో ఫ్రాడ్ కేసు..ఇద్దరికి 3 ఏళ్ల జైలుశిక్ష..!!
- కువైట్‌లో భారత్ మేళా 2026 విజయవంతం..!!
- టాప్ 100 లో కింగ్ హమద్ యూనివర్సిటీ హాస్పిటల్..!!
- ముంబై-మస్కట్ ఫ్లైట్ లో రాత్రంతా చిక్కుకుపోయిన ప్రయాణికులు..!!
- ఇన్స్టంట్ లోన్స్: మీ స్మార్ట్‌ఫోన్ నుంచే తక్షణ రుణం
- రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
- కువైట్‌లో ‘వికసిత్ భారత్ 2047: ఇండియా-కువైట్ డైలాగ్స్’ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ముగిసిన ప్రపంచ పారా బ్యాడ్మింటన్..!!









