టైటానిక్ సెర్చ్ ఆపరేషన్ విషాదాంతం.అయిదుగురు జల సమాధే..!

- June 23, 2023 , by Maagulf
టైటానిక్ సెర్చ్ ఆపరేషన్ విషాదాంతం.అయిదుగురు జల సమాధే..!

దుబాయ్‌: ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు టైటానిక్ సెర్చ్ ఆపరేషన్ విషాదాంతం అయ్యింది. అట్లాంటిక్‌ మహా సముద్రంలో టైటానిక్‌ ఓడ శకలాలను చూసేందుకు వెళ్లేందుకు టైటాన్‌ మినీజలాంతర్గామి కథ ముగిసింది. అందులోని అయిదుగురూ ప్రాణాలు కోల్పోయినట్లే. టైటాన్‌ శకలాలను టైటానిక్‌ సమీపంలోనే గుర్తించినట్లు అమెరికా తీర రక్షక దళం అధికారికంగా ప్రకటించింది.తాము నీటి అడుగుకు పంపించిన రిమోటెడ్‌ ఆపరేటెడ్‌ వెహికిల్‌.. శకలాలను గుర్తించిందని వెల్లడించింది. అవి టైటాన్‌వేనని భావిస్తున్నట్లు తెలిపింది. 
మరోవైపు తమ సంస్థ చీఫ్‌ పైలట్.. చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ స్టాక్టన్‌ రష్, ప్రయాణికులైన షహ్‌జాదా దావూడ్, ఆయన కొడుకు సులేమాన్‌ దావూద్, హామిష్‌ హార్డింగ్, పౌల్‌–హెన్రీ నర్గియెలెట్‌ మృతి చెందారని టైటాన్‌ మినీజలాంతర్గామిని పంపిన ఓషన్‌ గేట్‌ తెలిపింది. అయితే, వారు ఎలా ప్రాణాలు కోల్పోయారనే విషయం మాత్రం వెల్లడించలేదు. ఆదివారం ఉదయం బయలుదేరిన టైటాన్‌ మినీజలాంతర్గామి కొద్ది సేపటికే మాతృ నౌక తో సంబంధాలను కోల్పోయిన విషయం తెలిసిందే. 
టైటాన్‌ కెనడాలోని న్యూఫౌండ్‌లాండ్‌ నుంచి 700 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో గల్లంతైంది.కాగా టైటాన్‌ ఉన్న ప్రాంతాన్ని గుర్తించడం ఒక పెద్ద సవాలుగా మారింది. అమెరికా కోస్ట్‌గార్డ్‌ సిబ్బందితోపాటు ఫ్రెంచ్‌ పరిశోధక సంస్థ డీప్‌–డైవింగ్‌ రోబోట్‌ను సెర్చ్ ఆపరేషన్ లో వినియోగించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com