హెచ్1బీ వీసాదారులకు కెనడా ప్రభుత్వం శుభవార్త
- June 28, 2023
ఒట్టావా: హెచ్1బీ వీసాపై అమెరికాలో ఉంటున్న వారికి కెనడా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ వీసా హోల్డర్లు తమ కుటుంబ సభ్యులతో పాటు కెనడాలోకి వచ్చి పనిచేసుకునే వీలు కల్పిస్తున్నట్లు వివరించింది. దేశంలో ఎక్కడైనా, ఏ కంపెనీలోనైనా పనిచేసుకునేందుకు అనుమతిస్తామని తెలిపింది. అంతేకాదు.. వీసా హోల్డర్ల కుటుంబ సభ్యులకూ పలు మినహాయింపులు ప్రకటించింది. వారు కూడా కెనడాలో చదువుకోవచ్చు లేదా పనిచేసుకునేందుకు పర్మిషన్ ఇస్తామని కెనడా ఇమిగ్రేషన్ వ్యవహారాల మంత్రి సియాన్ ఫ్రేజర్ మంగళవారం పేర్కొన్నారు.
ఇలా దేశంలోకి అడుగుపెట్టే హెచ్1బీ వీసా హోల్డర్లకు మూడేళ్ల పాటు తాత్కాలిక నివాస హోదా కల్పిస్తామని మంత్రి వివరించారు. అయితే, ఈ అవకాశం కేవలం 10 వేల మందికి మాత్రమేనని, ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఉద్యోగ నిమిత్తం అమెరికాకు వచ్చే విదేశీ నిపుణులకు ఇచ్చే వీసానే ఈ హెచ్1బీ.. ఈ వీసా హోల్డర్లు తమ కుటుంబ సభ్యులను డింపెండెంట్ వీసాపై అమెరికా తీసుకుని వెళ్లవచ్చు.
ఇలా అమెరికాలో అడుగుపెట్టే వారు ఉద్యోగం చేయాలన్నా, చదువుకోవాలన్నా ప్రత్యేకంగా అనుమతి పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ వీసాతో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారిలో భారతీయులు, చైనా వారే ఎక్కువగా ఉన్నారు. వృత్తిపరంగా అత్యుత్తమ నైపుణ్యం కలిగిన వారికే అమెరికా ఈ హెచ్1బీ వీసా జారీ చేస్తుంది. ఈ క్రమంలో నిపుణులను తమ దేశంలోకి ఆహ్వానించేందుకు కెనడా ప్రభుత్వం తాజా వెసులుబాటు కల్పించింది.
తాజా వార్తలు
- పౌరుల హక్కుల పరిరక్షణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కీలకం..!!
- రెసిలెన్స్ ఫ్లీట్‌లో పౌరుల భద్రతపై ఒమన్ పర్యవేక్షణ..!!
- రక్షణ సంబంధాలపై సౌదీ, ఖతార్ చర్చలు..!!
- UK సినగోగ్ పై ఘోరమైన దాడి.. ఖండించిన బహ్రెయిన్..!!
- దుబాయ్‌లో అక్రమ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్..!!
- తప్పిపోయిన ఫాల్కన్ల ఓనర్లకు గుడ్ న్యూస్..!!
- ఫ్లిప్‌కార్ట్ లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 8 వరకు ఆఫర్లు
- బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సౌదీ సెంట్రల్ బ్యాంక్..!!
- క్రిమినల్ జస్టిస్.. ఖతార్ లో కొత్త విభాగం ఏర్పాటు..!!
- అనుమతి లేకుండా ఫిల్మింగ్..వ్యక్తికి Dh30,000 ఫైన్..!!