తెలంగాణ ఠీవీ.. మన పీవీ: సిఎం కెసిఆర్‌

- June 28, 2023 , by Maagulf
తెలంగాణ ఠీవీ.. మన పీవీ: సిఎం కెసిఆర్‌

హైదరాబాద్: నేడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 102వ జయంతి సందర్భంగా ఆయన సేవలను తెలంగాణ సిఎం కెసిఆర్‌ స్మరించుకున్నారు. పలు సంస్కరణలతో భారతదేశ ఔన్నత్యాన్ని పీవీ కాపాడారని సిఎం కెసిఆ కొనియాడారు. క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అన్నారు. నాడు పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలే నేడు దేశ ప్రజల అనుభవంలోకి వచ్చాయని సిఎం కెసిఆ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఠీవీ.. మన పీవీ అని అన్నారు. పీవీ స్ఫూర్తితో దేశాభివృద్ధి దిశగా ముందుకు సాగుతామని సిఎం కెసిఆర్‌ అన్నారు. ఆయన జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com