వారం రోజులపాటు ‘టేస్ట్ ఆఫ్ కొరియా’

- June 28, 2023 , by Maagulf
వారం రోజులపాటు ‘టేస్ట్ ఆఫ్ కొరియా’

కువైట్: రిపబ్లిక్ ఆఫ్ కొరియా,  కొరియా ట్రేడ్-ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ (KOTRA) దౌత్యకార్యాలయం అసిమా మాల్‌లోని మోనోప్రిక్స్‌లో "కొరియన్ ప్రొడక్ట్ వీక్:టేస్ట్ ఆఫ్ కొరియా" పేరిట నిర్వహిస్తున్న ఈవెంట్ ను ప్రారంభించాయి. కువైట్‌లోని రిపబ్లిక్ ఆఫ్ కొరియా రాయబారి చుంగ్ బైంగ్-హా ఆహారం సంస్కృతిని సూచిస్తుందని, సంస్కృతిని ఆహారం ద్వారా బాగా అర్థం చేసుకోవచ్చని ప్రారంభోత్సవం సందర్భగా తెలిపారు. ప్రజలు కొరియా రుచులను ఆస్వాదించడానికి  'టేస్ట్ ఆఫ్ కొరియా' ఈవెంట్‌ను మిస్ చేయకూడదని చెప్పారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడానికి, పౌరులకు మరియు నివాసితులకు అధిక-నాణ్యత కొరియన్ వంటకాలు, పానీయాలను అందించడానికి "టేస్ట్ ఆఫ్ కొరియా" కీలకమని రాయబారి ధృవీకరించారు.  జూన్ 25 నుండి జూలై 2 వరకు "టేస్ట్ ఆఫ్ కొరియా" నిర్వహించబడుతుందని తెలిపారు.      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com