రెసిడెన్షియల్ టవర్ అగ్నిప్రమాదం. దెబ్బతిన్న 64 అపార్ట్‌మెంట్లు, 10 వాహనాలు
- June 28, 2023
యూఏఈ:అజ్మాన్ వన్ టవర్ (02) వద్ద జరిగిన అగ్నిప్రమాదం కారణంగా అనేక ఫ్లాట్లు, వాహనాలు దెబ్బతిన్నాయని అజ్మాన్ పోలీస్‌లోని అల్ మదీనా సమగ్ర పోలీస్ స్టేషన్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ ఘైత్ ఖలీఫా అల్ కాబీ తెలిపారు. ప్రమాదం కారణంగా దెబ్బతిన్న నివాస అపార్ట్‌మెంట్ల సంఖ్య 64కి చేరిందని, మంటల కారణంగా 10 వాహనాలు దెబ్బతిన్నాయని, ఒక కారు పూర్తిగా దగ్ధమైందని ఆయన వివరించారు. ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్, ఛారిటీ అసోసియేషన్‌ల సమన్వయంతో పోలీసులు తక్షణమే ఎమిరేట్‌లోని హోటళ్లలో 256 మందికి వసతి కల్పించామన్నారు. బాధితు రవాణాకు ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ సహకారంతో 7 బస్సులను అందించారని, అదే సమయంలో విద్యుత్ పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- కరూర్ ఘటనపై విజయ్ పై హైకోర్టు ఆగ్రహం
- ఏపీ: ఆటో డ్రైవర్ సేవలో..
- ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పు..
- పౌరుల హక్కుల పరిరక్షణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కీలకం..!!
- రెసిలెన్స్ ఫ్లీట్‌లో పౌరుల భద్రతపై ఒమన్ పర్యవేక్షణ..!!
- రక్షణ సంబంధాలపై సౌదీ, ఖతార్ చర్చలు..!!
- UK సినగోగ్ పై ఘోరమైన దాడి.. ఖండించిన బహ్రెయిన్..!!
- దుబాయ్‌లో అక్రమ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్..!!
- తప్పిపోయిన ఫాల్కన్ల ఓనర్లకు గుడ్ న్యూస్..!!
- ఫ్లిప్‌కార్ట్ లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 8 వరకు ఆఫర్లు