ఈద్ అల్ అధా: లుసైల్ బౌలేవార్డ్లో బాణసంచా ప్రదర్శన
- June 28, 2023
దోహా: ఈద్ అల్ అదా 2023 సందర్భంగా లుసైల్ బౌలేవార్డ్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఖతారీ దియార్, లుసైల్ సిటీ ప్రకటించాయి. ఈద్ మొదటి రోజు అయిన జూన్ 28న నిర్వాహకులు అన్ని వయసుల వారి కోసం ప్రత్యేక కార్యకలాపాలను ప్లాన్ చేసారు. అల్ సాద్ స్క్వేర్లో రాత్రి 8:30 గంటలకు ప్రారంభమయ్యే అద్భుతమైన బాణాసంచా ప్రదర్శన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈద్ అలంకరణలు, ప్రత్యేక లైటింగ్లు జూలై 5 వరకు ఉంటాయని, నగరం అంతటా పండుగ ప్రకంపనలు చాలా రోజుల పాటు విస్తరిస్తాయని ప్రకటన పేర్కొంది. నిర్వాహకులు ఈ అద్భుతమైన ఈవెంట్కు హాజరుకావాలని, లుసైల్ సిటీలో మరియు చుట్టుపక్కల ఉన్న రెస్టారెంట్లు, కేఫ్లలో స్పెషల్ డిషెస్ ను ఆస్వాదించాలని ప్రజలను ఆహ్వానించారు.
తాజా వార్తలు
- ఏపీ: ఆటో డ్రైవర్ సేవలో..
- ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పు..
- పౌరుల హక్కుల పరిరక్షణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కీలకం..!!
- రెసిలెన్స్ ఫ్లీట్లో పౌరుల భద్రతపై ఒమన్ పర్యవేక్షణ..!!
- రక్షణ సంబంధాలపై సౌదీ, ఖతార్ చర్చలు..!!
- UK సినగోగ్ పై ఘోరమైన దాడి.. ఖండించిన బహ్రెయిన్..!!
- దుబాయ్లో అక్రమ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్..!!
- తప్పిపోయిన ఫాల్కన్ల ఓనర్లకు గుడ్ న్యూస్..!!
- ఫ్లిప్కార్ట్ లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 8 వరకు ఆఫర్లు
- బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సౌదీ సెంట్రల్ బ్యాంక్..!!