జెడ్డాలోని యుఎస్ కాన్సులేట్‌పై దాడి.. కాల్పుల్లో ముష్కరుడు మృతి
- June 29, 2023
జెడ్డా: బుధవారం జెడ్డాలోని అమెరికన్ కాన్సులేట్ భవనంపై ఓ సాయుధ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. అనంతరం చోటుచేసుకున్నఎదురుకాల్పుల తర్వాత దుండగుడు మరణించాడని అధికారిక ప్రతినిధి తెలిపారు. ఎదురుకాల్పుల సందర్భంగా కాన్సులేట్ సెక్యూరిటీ గార్డుల్లో నేపాలీ కార్మికుడు తీవ్రంగా గాయపడి మరణించాడు. ప్రమాదం పరిస్థితులను నిర్ధారించడానికి భద్రతా పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయని మక్కా పోలీసు ప్రతినిధి తెలిపారు. “బుధవారం సాయంత్రం 6:45 గంటలకు జెడ్డాలోని అమెరికన్ కాన్సులేట్ భవనం దగ్గర కారులో వచ్చిన ఒక వ్యక్తి, కారును ఆపి చేతిలో తుపాకీని పట్టుకుని బయటకు వచ్చాడు. భద్రతా అధికారుల హెచ్చరికలను పెడచెవిన పెట్టిన అతను కాల్పులకు తెగబడ్డాడు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపి సదరు సాయుధుడి మట్టుబెట్టాయి.’’ అని పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- విశాఖలో విషాదం..బీచ్‌లో కొట్టుకుపోయిన ఇద్దరు విదేశీయులు..
- ఖతార్ లో సందడి చేయనున్న బాలీవుడ్ స్టార్స్..!!
- సౌదీ అరేబియాలో పారాగ్లైడింగ్ రీ ఓపెన్..!!
- దుబాయ్ లో విల్లాపై రైడ్..40 కేజీల డ్రగ్స్ సీజ్..!!
- కువైట్ లో పబ్లిక్ హైజిన్ ఉల్లంఘనలపై కొరడా..!!
- ఒమన్ విజన్ 2040.. ఫుడ్ సెక్యూరిటీ ల్యాబ్..!!
- గాజాలో శాశ్వత కాల్పుల విరమణకు బహ్రెయిన్ పిలుపు..!!
- SATA ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- ఎయిర్ ఇండియా విమానంలో RAT అకస్మాత్తుగా తెరుచుకుపోయింది
- 200 మంది టీచర్లకు గోల్డెన్ వీసా మంజూరు చేసిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..!!