ఖతార్ లో 22 శాతం పెరిగిన విమాన ప్రయాణీకుల సంఖ్య
- June 29, 2023
దోహా, ఖతార్: మే నెలకు సంబంధించి ఖతార్ లో విమాన ప్రయాణీకులలో 22.2 శాతం, విమానాల మూవ్ మెంట్ 16.6 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (QCCA) ఇటీవల చేసిన ట్వీట్ ప్రకారం.. మే నాటికి దేశంలో 3.4 మిలియన్ల విమాన ప్రయాణీకులు నమోదయ్యారు. అంతకుముందు సంవత్సరంలో ఇది 2.8 మిలియన్లుగా ఉంది.
ఎయిర్ కార్గో, మెయిల్ సర్వీసుల విషయానికి వస్తే మే 2022తో పోలిస్తే 0.7 శాతం స్వల్పంగా పెరిగింది. మే 2022లో 191,675 టన్నులతో పోలిస్తే 2023 మె నెలలో 193,008 టన్నులుగా నమోదైందని ఏప్రిల్ 2023లో ఖతార్ దాని మునుపటి నెలతో పోల్చితే దాని విమాన ప్రయాణీకుల సంఖ్య 31 శాతం పెరిగింది. అదే నెలలో ఎయిర్‌క్రాఫ్ట్ మూవ్మెంట్ గత ఏడాది ఇదే సమయంలో 16,411తో పోలిస్తే 18,762 విమానాలతో 14.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2023 మొదటి త్రైమాసికంలో హయ్యా కార్డ్‌ల పొడిగింపు, విశ్రాంతి కార్యకలాపాలు వంటి అదనపు ప్రయోజనాలతో విమాన మూవ్ మెంట్ లో వృద్ధి నమోదైంది.
హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దోహా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తమ కార్యకలాపాలను ప్రారంభించినప్పటి నుండి ఫిబ్రవరి, మార్చిలలో ప్రయాణికుల సంఖ్య పరంగా అత్యధిక కార్యాచరణను నమోదు చేసింది. 2022లో ఇదే కాలంతో పోలిస్తే మార్చిలో ప్రయాణీకుల సంఖ్య 25 శాతం పెరిగింది. విమాన మూవ్ మెంట్ 12.9 శాతంగా ఉంది. అయితే, ఎయిర్ ఫ్రైట్ మరియు మెయిల్ కార్యకలాపాలు గత సంవత్సరం మార్చితో పోలిస్తే 5.2 శాతం తగ్గాయి.
జనవరిలో ఖతార్ FIFA ప్రపంచ కప్ 2022 కారణంగా విమాన ప్రయాణీకులలో 64.4 శాతం భారీ రికార్డును నమోదు చేసింది. అయితే ఎయిర్ ట్రాన్స్పోర్ట్ గణాంకాలు 19,377 విమానాలతో విమానాల కదలికలో 16,239 తో పోలిస్తే 19.3 శాతం పెరుగుదల ఉన్నట్లు సూచించింది. టూరిస్ట్-ఆధారిత హబ్‌గా దేశం పురోగమిస్తోందని, 2030 నాటికి సంవత్సరానికి 6 మిలియన్లకు పైగా సందర్శకులను వస్తారని ఖతార్ టూరిజం, ఖతార్ ఎయిర్వేస్ ఉన్నత అధికారులు భావిస్తున్నారు. వచ్చే ఏడేళ్లలో ఖతార్ జిడిపిలో 7 శాతంగా ఉన్న టూరిజం ఆదాయం 12 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







