మహిళను ఢీకొట్టిన డ్రైవర్. 200,000 దిర్హామ్ బ్లడ్ మనీ చెల్లించాలని ఆదేశం
- June 30, 2023
యూఏఈ: రెడ్ లైట్ నిబంధనను ఉల్లంఘించి, వాహనంతో ఇద్దరు మహిళలపైకి దూసుకెళ్లిన అరబ్ యువకుడి జైలు శిక్ష పడింది. ఈ ఘటనలో ఒక మహిళ మరణించగా.. మరొకరు గాయపడ్డారు. కేసును విచారించిన ఖోర్ ఫక్కన్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ Dh5,000 జరిమానా, Dh200,000 బ్లడ్ మనీని వ్యక్తిగతంగా లేదా ప్రమాదానికి గురైన వాహనానికి బీమా చేసిన కంపెనీతో కలిసి చెల్లించాలని ఆదేశించింది. రెడ్ లైట్ సిగ్నల్ పడ్డ సమయంలో జంక్షన్ వద్ద వాహనాన్ని ఆపకుండా డ్రైవర్ నిర్లక్ష్యం, అజాగ్రత్త కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని నివేదికలో పేర్కొన్నారు. డ్రైవర్ నేరాన్ని అంగీకరించాడు. ప్రమాదవశాత్తు బాధితుల మరణానికి/గాయానికి కారణమైనందుకు కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఆర్టికల్స్ (88), (87) నిబంధనల ప్రకారం, డ్రైవర్‌ను ఏడాది పాటు జైలులో పెట్టాలని కోర్టు తీర్పునిచ్చింది. బాధితురాలు వారసులకు 200,000 దిర్హామ్‌ల చట్టబద్ధమైన రక్త ధనం చెల్లించాలని ఆదేశించింది. నిందితుడు తీర్పుపై అప్పీల్ చేయగా, అప్పీల్‌ను తిరస్కరించాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోర్టును అభ్యర్థించింది.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్‌కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!
- రీసైకిల్ పదార్థాలతో క్రెడిట్ కార్డుల తయారీ..!!
- అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం







