కువైట్, ఫ్రాన్స్ సంబంధాలు బలోపేతం
- July 01, 2023
కువైట్: అన్ని రంగాలలో సహకారాన్ని ప్రోత్సహించడానికి, ద్వైపాక్షిక సంబంధాల కోసం ఫ్రాన్స్‌తో ఓ అవగాహన ఒప్పందం కుదిరిందని కువైట్ విదేశాంగ మంత్రి షేక్ సలేం అబ్దుల్లా అల్-జాబర్ అల్-సబాహ్ వెల్లడించారు. తన ఫ్రాన్స్ పర్యటన ఫలితం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. కువైట్ పౌరులకు స్కెంజెన్ వీసాల జారీని సులభతరం చేసే అవకాశంతో సహా సంబంధాల అవకాశాలపై యూరప్, విదేశాంగ వ్యవహారాల ఫ్రెంచ్ మంత్రి కేథరీన్ కొలోనాతో చర్చించినట్లు అతను పేర్కొన్నాడు. ఫ్రెంచ్ దౌత్యవేత్త కువైట్ డిమాండ్‌ను అర్థం చేసుకున్నారని, ఈ సమస్యపై సానుకూలంగా స్పందించారని ఆయన అన్నారు. ఈ మేరకు కువైట్, ఫ్రాన్స్‌ల మధ్య వ్యూహాత్మక సంభాషణను ప్రారంభించడంపై అవగాహన ఒప్పందంతో సహా అనేక ఒప్పందాలపై సంతకం చేసినట్లు పేర్కొన్నారు.
కువైట్ ఫండ్ ఫర్ అరబ్ ఎకనామిక్ డెవలప్మెంట్ (KFAED), ఫ్రెంచ్ డెవలప్మెంట్ ఏజెన్సీ (AFD) కూడా ఆర్థికాభివృద్ధి రంగంలో సహకారాన్ని పెంపొందించేందుకు అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. షేక్ సేలం ఆలివర్ బెచ్ట్, విదేశీ వాణిజ్యం, ఆర్థిక ఆకర్షణ, విదేశాలలో ఉన్న ఫ్రెంచ్ జాతీయుల కోసం ఫ్రెంచ్ ప్రతినిధితో పెట్టుబడి, ఆర్థిక రంగాలలో సహకారం గురించి సమావేశంలో చర్చించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్‌ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







