విదేశీయులతో ఒమానీల వివాహం కోసం దరఖాస్తుల స్వీకరణ
- July 03, 2023
మస్కట్: విదేశీయులకు ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఒమానీల వివాహ ధృవీకరణ పత్రాల జారీ కోసం అన్ని దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించినట్టు నోటరీ పబ్లిక్ డిపార్ట్మెంట్ల ద్వారా ప్రాతినిధ్యం వహిస్తున్న సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ వెల్లడించింది. రాయల్ డిక్రీ నం. 23/2023, సివిల్ ట్రాన్సాక్షన్స్ లా (29/2013) ప్రకారం విదేశీయులతో ఒమానీల వివాహానికి సంబంధించిన డాక్యుమెంటేషన్, విధివిధానాల ఖరారును నోటరీల విభాగాలు చేపడతాయని సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇస్లామిక్ షరియా నిబంధనలకు అనుగుణంగా.. ప్రాముఖ్యత లేదా ప్రత్యేక స్వభావం గల కొన్ని పబ్లిక్ ఫంక్షన్ల కోసం వివాహాన్ని నియంత్రించే సమస్యకు డిక్రీలో సూచించిన నియంత్రణలకు ఇవి అదనమని తెలిపింది. పౌరుల వివాహానికి సంబంధించి ఇతర దేశాల చట్టాలను పాటించడం ప్రాముఖ్యతను ఈ సందర్భంగా వివరించింది. రాయల్ డిక్రీ (23/2023) జారీకి ముందు జరిగిన విదేశీయులతో ఒమానీల వివాహ కేసులు చట్టం నిర్దేశించిన ప్రకారం పరిష్కరించబడతాయని సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు
- అమరావతి అభివృద్ధికి వేగం: కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
- తిరుమలలో కీలక మార్పులు...
- పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ
- యూఏఈ ప్రయాణికుల పై ఇండిగో రద్దు ప్రభావమెంత?
- ఉమ్మడి సహకారంపై సౌదీ-ఖతార్ చర్చలు..!!
- బహ్రెయిన్ లో కల్చర్డ్ పెరల్స్ పై నిషేధం?
- అరబ్ కప్ ఖతార్ 2025..ఉచిత షటిల్ బస్సు సర్వీస్..!!
- మస్కట్ లో ‘ది లైఫ్‌స్పాన్ 2025’ ప్రారంభం..!!
- సివిల్ ఐడి డేటా ఫోర్జరీ..క్రిమినల్ గ్యాంగ్ అరెస్టు..!!







