బీజేపీ అధ్యక్ష పదవికి నేను అర్హుడినే: రఘునందన్‌రావు
- July 03, 2023
హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు హాట్ కామెంట్స్ చేశారు. తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మూడు పదవుల్లో ఏదో ఒక పదవి ఇవ్వాలని రఘునందన్‌రావు కోరారు. పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్ లేదంటే జాతీయ అధికార ప్రతినిధి పదవి ఇవ్వాలన్నారు. పదేళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నానని తానెందుకు అధ్యక్ష పదవికి అర్హుడిని కానని పేర్కొన్నారు. కొన్ని విషయాల్లో తన కులమే తన శాపం కావొచ్చన్న ఆయన రెండు నెలల్లో బీజేపీ ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుందని అన్నారు. రెండోసారి కూడా దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనకు దుబ్బాకలో ఎవరూ సాయం చేయలేదని తాను పార్టీలో ఉండాలని అనుకుంటున్నానని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్‌బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్‌గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్‌లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం
- కర్నూల్లో ప్రధాని మోదీ రాకకు టీడీపీ ఏర్పాట్లు