మళ్లీ నాజూకైన అనుష్క
- May 14, 2016
'సైజ్‌జీరో' చిత్రం కోసం బరువు పెరిగి కొత్త ప్రయత్నం చేసిన అనుష్క... తాజాగా అక్కినేని నాగార్జున నటించిన 'వూపిరి' చిత్రంలో ఆయన ప్రేయసి పాత్రలో కనిపించారు. అప్పటికే చాలా బరువు తగ్గినట్లు అనిపించిన అనుష్క ఇప్పుడు ఇంకా నాజూకుగా, అందంగా కనిపిస్తున్నారు. సోషల్‌మీడియా ద్వారా అప్పుడప్పుడు అభిమానులకు టచ్‌లో ఉండే అనుష్క శనివారం తన ఫేస్బుక్ ఖాతాలో ఒక ఫొటోను పోస్ట్ చేశారు. 'ఫన్ టైమ్ ఫ్యామిలీ టైమ్... ఈట్ ప్రే లవ్' అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న 'బాహుబలి: ది కన్‌క్లూజన్'లో నటిస్తున్నారు. అదేవిధంగా సూర్య హీరోగా తెరకెక్కిస్తున్న 'సింగం-3' చిత్రంలో కథానాయకిగా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్‌ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







