‘డబుల్ ఇస్మార్ట్’ ప్రపంచంలోకి ఉస్తాద్ రామ్ గ్రాండ్ ఎంట్రీ.!
- July 11, 2023‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించిన ఈ సినిమా రెగ్యులర్ షూట్ కూడా మొదలెట్టేయనున్నారు పూరీ అండ్ టీమ్.
ఈ నేపథ్యంలో రామ్ తాజా లుక్స్‌కి సంబంధించి ఓ వీడియో రిలీజ్ చేశారు. డిఫరెంట్ హెయిర్ స్టైల్లో ఉస్తాద్ రామ్ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ‘ఇస్మార్ట్ శంకర్’లో పూర్తి మాస్ లుక్స్‌లో కనిపించిన రామ్ పోతినేని, ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం కంప్లీట్ స్మార్ట్ లుక్స్‌లోకి మారిపోయినట్లు కనిపిస్తోంది.
ఇప్పటి వరకూ బోయపాటి సినిమా కోసం మాస్ లుక్స్‌లో కనిపించిన రామ్ పోతినేని, తాజా సినిమా కోసం చూపించిన ట్రాన్స్‌ఫర్మేషన్‌కి ఆయన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
రామ్ లుక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయ్. ‘లైగర్’ ఫ్లాప్ తర్వాత పూరీ చేస్తున్న సినిమా ఇది. చూస్తుంటే, పక్కా ప్లానింగ్‌తో పూరీ జగన్నాధ్ ఈ సినిమాని లాంఛ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. షూట్ స్టార్ట్ అవ్వకుండానే, రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశాడు. అదీ పూరీ డేరింగ్ అంటే. వచ్చే ఏడాది మార్చి 8న ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్ కానుంది.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు