తెలుగు రాష్ట్రాల్లో సేవలు మరింత విస్తృతం చేస్తాం: తానా నూతన అధ్యక్షుడు నిరంజన్
- July 13, 2023
అమెరికా: అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం నూతన అధ్యక్షునిగా నిరంజన్ శృంగవరపు పదవీ బాధ్యతలు చేపట్టారు. 2023`25 సంవత్సరానికిగాను తానా అధ్యక్షునిగా ఆయన వ్యవహరిస్తారు. తన రెండేళ్ళ పదవీకాలంలో తానా టీమ్‌తో కలిసి తెలుగు రాష్ట్రాల్లో తానా సేవలను మరింత విస్తృతపరుస్తానని నిరంజన్ శృంగవరపు పేర్కొన్నారు. ఉచిత కంటి చికిత్స శిబిరాలు, క్యాన్సర్ శిబిరాలు, రైతులకు అవసరమైన రక్షణ పరికరాలు, ఇఎన్‌టి, ఇతర చికిత్సలకోసం వైద్యశిబిరాలను ఏర్పాటు చేయడంతోపాటు, పేద విద్యార్థులు ఇబ్బందులు పడకుండా వారు చదువును కొనసాగించేందుకు వీలుగా స్కాలర్ షిప్ లను, మహిళలకు కుట్టు మిషన్లు, వికలాంగులకు ట్రై సైకిళ్ళు వంటి వాటిని పెద్దఎత్తున పంపిణీ చేస్తామని నిరంజన్ తెలిపారు. అమెరికాలోని తెలుగు కమ్యూనిటీతోపాటు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారికి తానా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటుందని ఆయన చెప్పారు.
కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ పరిధిలోని రాజానగరంకు చెందిన నిరంజన్ శృంగవరపు తానాలో అంచెలంచెలుగా ఎదిగారు. తానా ఫౌండేషన్ చైర్మన్‌గా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలను చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఆయన ఫౌండేషన్ ద్వారా కోట్లాదిరూపాయలతో నిత్యావసర సరుకులను ఇతర సహాయ కార్యక్రమాలను ఆయన అందించారు. తానాలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించిన అనుభవంతో తానా అధ్యక్షునిగా మరింతగా తెలుగురాష్ట్రాల్లోని వారితోపాటు దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారికి కూడా తానా ద్వారా సహాయం అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









