ఒమన్ జనాభాలో 43 శాతం ప్రవాసులే..!
- July 18, 2023
మస్కట్: జూలై 10, 2023 నాటికి ఒమన్ సుల్తానేట్ జనాభా 5,083,300కి చేరుకుందని నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) బుధవారం ప్రకటించింది. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన NCSI నివేదికలో మొత్తం 2,897,436 మంది ఒమానీ జాతీయులు (57 శాతం) ఉన్నారు. మిగిలిన 43 శాతం జనాభాలో ప్రవాసులు (2,185,864) ఉన్నారు.
ఒమానీ పురుషుల కంటే ప్రవాస పురుషుల సంఖ్య 4.8 శాతం ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది. ప్రవాస జనాభాలో పురుషులు 35 శాతం (1,702,905.5 వ్యక్తులు) ఉండగా.. స్త్రీలు 9.5 శాతం (482,913.5 వ్యక్తులు) ఉన్నారు. ఒమానీ జనాభాలో పురుషులు, స్త్రీల సంఖ్యలో స్వల్ప వ్యత్యాసం ఉంది. ఇందులో పురుషులు 28.7 శాతం (1,458,907.1 వ్యక్తులు), స్త్రీలు 28.3 శాతం (1,438,573.9 వ్యక్తులు) ఉన్నారు. ఒమన్ జనాభా సంవత్సరానికి 1.49 శాతం చొప్పున పెరుగుతోందని నివేదిక స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!