ద్వైపాక్షిక సంబంధాలపై ఒమన్, సౌదీ చర్చలు

- July 20, 2023 , by Maagulf
ద్వైపాక్షిక సంబంధాలపై ఒమన్, సౌదీ చర్చలు

జెద్దా: సౌదీ అరేబియా (కెఎస్‌ఇ) విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ ఫర్హాన్ అల్ సౌద్‌తో ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైదీ సమావేశమయ్యారు. జెడ్డాలో జరిగిన GCC-సెంట్రల్ ఆసియా సమ్మిట్ సందర్భంగా ఇది జరిగింది.  ఈ సమావేశంలో ఇరు పక్షాలు ద్వైపాక్షిక సంబంధాలు, వాటిని పెంపొందించే మార్గాలపై సమీక్షించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలపై కూడా చర్చించారు. ఇంకా, ఇరుపక్షాలు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ ప్రాంతీయ మరియు అంతర్జాతీయ విషయాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com