విమానం ఢీకొని ఇద్దరు దుబాయ్ వాసులు మృతి..!

- July 30, 2023 , by Maagulf
విమానం ఢీకొని ఇద్దరు దుబాయ్ వాసులు మృతి..!

యూఏఈ: జులై 28న ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లోని కాబూల్చర్ ఎయిర్‌ఫీల్డ్‌పై విమానం ఢీకొన్న ప్రమాదంలో ప్రతిష్టాత్మకమైన యోగా శిక్షకురాలు, ప్రఖ్యాత రచయిత్రి జాన్ మాడెర్న్, ఆమె భర్త డేవిడ్ మాడెర్న్‌ మరణించారు. గతంలో వీరు దుబాయ్ లో నివసించారు. దీంతో దుబాయ్ లోని నివాసితులు వారికి సంతాపం తెలిపారు. ముఖ్యంగా జాన్ యోగా తరగతులు మరియు ఫిట్‌నెస్ పుస్తకాలు చాలా మంది జీవితాలను మార్చాయని గుర్తుచేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు నివాసితులు నివాళులు అర్పిస్తున్నారు. "ఈ విషాద వార్త వినడానికి చాలా బాధగా ఉంది. వారు చాలా ఏళ్లుగా తెలుసు. వారు చాలా సున్నితమైన, మంచి వ్యక్తులు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి" అని ఒక నివాసి ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసారు. ఆస్ట్రేలియా స్థానిక మీడియా సంస్థల ప్రకారం, ఒక విమానం టేకాఫ్ , మరొకటి ల్యాండింగ్ సమయంలో ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనపై స్థానిక అధికారులు విచారణ జరుపుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com