తిరుమలలో ఉగ్ర జెండాలు

- May 16, 2016 , by Maagulf
తిరుమలలో ఉగ్ర జెండాలు

తెలుగు రాష్ట్రాలకే కాదు యావత్ భారత దేశంలో ఎంతో పుణ్యక్షేత్రంమైన తిరుపతిలో ఇప్పుడు ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ జెండాలు వెలిశాయి. ఇప్పటికే ప్రపంచ దేశాలను వణుకి పుట్టిస్తున్న ఉగ్రవాద సంస్థ కన్ను తిరుపతి పై పడిందా అని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే భారత దేశంలో ఎన్నో అరాచకాలు సృష్టిస్తున్న ఉగ్రవాద సంస్థలు పుణ్యక్షేత్రాలపై కన్నేయడం ఒకింత భయాందోళన కలిగించే విషయమే. తిరుమలలోని జాపాలీ తీర్థానికి వెళ్లే రహదారిలో ఈ జెండా కనిపించడం షాక్‌కు గురి చేసింది.ఈ జెండాతో పాటు ఓ సామాజిక వర్గానికి చెందిన జెండాలు కూడా అక్కడ కనిపించాయి. ఇప్పటికే ఇంటిలీజెన్స్ వారు ఉగ్ర వాదుల నుంచి ముప్పు ఉందని ఇప్పటికే పలు మార్లు అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీచేశారు. ఈ సంవత్సరం మొదలు పంజాబ్ లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. తాజాగా తిరుపతిలో ఐఎస్ఐఎస్ జెండా దర్శనమివ్వడంతో భక్తులు షాక్ తిన్నారు. దీంతో వెంటనే పోలీస్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్న సిబ్బంది ఆ జెండాలను తొలగించారు. ఐతే వాటిని అక్కడ పెట్టింది ఎవరన్నది తేలాల్సి ఉంది. కాగా అసలు ఈ జెండాలను పవిత్ర తిరుమల క్షేత్రం పైకి ఎందుకు తెచ్చారన్నది ప్రశ్నగా మారింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com