మల బద్ధకం సమస్య వున్నవాళ్లు ఈ ఫుడ్ తినకూడదా.?
- August 01, 2023
చాలా మందిలో మలబద్ధకం సమస్య తీవ్రంగా వుంటుంది. ఈ సమస్య వున్న వాళ్లు ఏ పని మీదా ఫోకస్ చేయలేరు. రోజంతా చికాకుగా వుంటారు. అయితే, సింపుల్‌గా ఈ మలబద్ధకం సమస్యని తీర్చేయగలమా.? అంటే, అందుకు రకరకాల ట్రీట్‌మెంట్స్ అందుబాటులో వున్నాయనుకోండి.
అయితే, ఇంటి చిట్కాలతోనే కొంత మలబద్ధక సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. మనం తీసుకునే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఈ సమస్య నుంచి కాస్తయినా ఉపశమనం పొందొచ్చు.
ముఖ్యంగా ఫైబర్ వున్న ఫుడ్ అధికంగా తీసుకోవడంతో, ఈ సమస్యకు చెక్ పెట్టేయొచ్చు. ఆకుకూరలూ, బోప్పాయి వంటి పండ్లలో అధికంగా ఫైబర్ కంటెంట్ వుంటుంది. రెగ్యలర్‌గా ఈ ఫుడ్‌ని తమ డైలీ మెనూలో చేర్చుకుంటే మంచిది.
అలాగే, ఈ సమస్య వున్న వాళ్లు కూరల్లో మసాలా కంటెంట్ తగ్గించాలి. అలాగే జీలకర్ర వాడకం కూగా కాస్త తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు.
కాఫీ, టీ అలవాటు ఎక్కువగా వుంటే ఆ అలవాటు కూడా తగ్గించుకోవాలి. వాటి ప్లేస్‌లో పలచగా కలిపిన మజ్జిగ కానీ, రాగులతో చేసిన అంబలి (జావ)కానీ తాగితే మంచి పలితం వుంటుంది. గడ్డ పెరుగుకు దూరంగా వుంటే మంచిది.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







