రామ్-శ్రీలీల వావ్.! వాట్ ఏ ఎనర్జీ.!
- August 01, 2023
రామ్ పోతినేని మంచి డాన్సర్. ఎనర్జిటిక్ హీరో. ఇక, ఈ ఎనర్జిటిక్ హీరోకి డాన్సింగ్ డాల్ శ్రీలీల తోడైతే ఎలా వుంటుంది. ఆ కిక్కు వేరే లెవల్‌లో వుంటుంది. ఈ కాంబినేషన్‌లో తాజాగా రూపొందుతోన్న సినిమా ‘స్కంధ’.
బోయపాటి శీను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రామ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న సినిమా ఇది. ప్యాన్ ఇండియా టార్గెట్‌గా దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
సెప్టెంబర్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లు షురూ చేశారు. అందులో భాగంగానే ‘స్కంధ’ నుంచి లిరికల్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. ‘నీ చుట్టూ చుట్టూ..’ అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమోలో ఓ చిన్న డాన్సింగ్ స్టెప్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది.
స్టైలిష్‌గా రామ్ వేస్తున్న స్టెప్పులకి, శ్రీలీల ఇస్తున్న ఎనర్జీ సపోర్ట్ అలా ఇలా లేదు. ఇది జస్ట్ ప్రోమోనే. దీనికి ఫుల్ లిరికల్ సాంగ్ ఆగస్ట్ 3న రానుంది. జస్ట్ శాంపిల్‌లోనే వీరిద్దరి డాన్సింగ్ కెమిస్ర్టీ ఈ రేంజ్‌లో వుంటే, ఇక, ఫుల్ లిరికల్ సాంగ్ ఏ రేంజ్‌లో వుండబోతోందో చూడాలి మరి.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







