హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలేంటీ.? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.?
- August 03, 2023
ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండానే హార్ట్ ఫెయిల్యూర్ కేసులు ఎక్కువగా వింటున్నాం. ఫిట్నెస్గా వున్న కొందరు యంగ్‌స్టర్స్ కూడా అనూహ్యంగా ఆకస్మాత్తుగా హార్ట్ ఫెయిల్యూర్‌కి గురై ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు ఈ మధ్య అనేకం చూస్తున్నాం.
అయితే, హార్ట్ ఫెయిల్యూర్ అనేది సడెన్‌గా జరిగిపోతుందా.? కాదు, ముందే కొన్ని హెచ్చరికలు చేస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. గుండె దడ, అలసట, ఆందోళన వంటి వాటిని నిర్లక్ష్యం చేస్తేనే హార్ట్ ఫెయిల్యూర్ అవుతుందని అంటున్నారు.
శరీరంలోని అవయవాలన్నింటికీ రక్తాన్ని సరఫరా చేసే గుండెను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత వుంది. గుండె చుట్టూ రక్తనాళాల్లో అసవసరమైన కొవ్వు పేరుకుపోతే, రక్త నాళాల్లో బ్లాక్స్ ఏర్పడి గుండె పోటు వచ్చే అవకాశాలున్నాయ్.
సో, ముందుగా కొలెస్ట్రాల్ కంట్రోల్ గుండెను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యతల్లో మొదటిది. అలాగే, లైఫ్ స్టైల్లో తీసుకునే కొన్ని జాగ్రత్తలు గుండెను ఆరోగ్యంగా వుంచేందుకు తోడ్పడతాయ్.
శరీరానికి తగినంత శ్రమ, రోజూ ఎంతో కొంత వ్యాయామం ఖచ్చితంగా డైలీ దినచర్యలో భాగం చేసుకోవాలి. ఆల్రెడీ గుండె సంబంధిత వ్యాధులేమైనా వుంటే, రెగ్యులర్‌గా వైద్యుని సంప్రదించడం, ఆహారంలో అధికంగా ఉప్పు వాడకాన్ని తగ్గించుకోవడం, గ్యాస్ అధికంగా నిండిన పానీయాల జోలికి పోకుండా వుండడం తదితర జాగ్రత్తలు గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయ్. గుండె పోటు నుంచి దూరంగా వుండేలా చేస్తాయ్.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి