తెలుగులో వారం ఆలస్యంగా 'రాయుడు' సినిమా..

- May 17, 2016 , by Maagulf
తెలుగులో వారం ఆలస్యంగా 'రాయుడు' సినిమా..

విశాల్, శ్రీదివ్య హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం 'మరుదు'. ముత్తయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమా 'రాయుడు' పేరుతో తెలుగులో విడుదల కానుంది. సాధారణంగా తెలుగులోనూ మంచి మార్కెట్ ఏర్పరచుకున్న విశాల్ వంటి తమిళ హీరోలు తమ సినిమాలను రెండు భాషల్లోను ఒకేసారి విడుదలయ్యేల ప్లాన్ చేసుకుంటారు. అయితే 'మరుదు' తమిళంలో ఈ నెల 20న విడుదలవుతుండగా తెలుగులో 27న 'రాయుడు'గా తెరమీదికి రానున్నాడు విశాల్. దానికి కారణం అదే రోజున మహేశ్ నటించిన 'బ్రహ్మోత్సవం' ఇక్కడ విడుదలవుతుండటమే. మహేష్ లాంటి స్టార్ హీరో సినిమా థియేటర్లలో ఉత్సవం చేస్తున్నపుడు విశాల్ వెనక్కి తగ్గడం సరైన నిర్ణయమే. పైగా తర్వాత కూడా 'అఆ' వంటి సినిమాలు లైన్లో ఉన్నాయి. ఈ సంగతి ఇలా ఉంటే.. విశాల్ నటించిన 'మదగజరాజా' దాదాపు రెండేళ్ళుగా థియేటర్ మొహం చూడటానికి ఆపసోపాలు పడుతోంది. ఎట్టకేలకు అనువాద సినిమాలు ఆక్రమించిన ఈ నెల 13న రావడం ఖాయమనుకున్నా అదీ జరగలేదు. దానిపై విశాల్ మాటేమిటో మరి..!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com