10ఏళ్ల తర్వాత కొడుకుని కలుద్దామని యూఏఈ వస్తే..
- August 09, 2023
యూఏఈ: యూఏఈలో తమ కుమారుడి కోసం వెతుక్కుంటూ వచ్చిన ఓ కుటుంబానికి నిరాశే ఎదురైంది. అతడు మృతి చెందాడని తెలుసుకొని గుండెలవిసేలా రోదించారు. పదేళ్లుగా తమ కొడుకును చూడని భారతీయ దంపతులు.. ఇప్పుడు అతడి మృతదేహాన్ని చూసి గుండెలు బాదుకుంటున్నారు. "చిన్నపాటి మనస్పర్ధల కారణంగా సదరు వ్యక్తి 10 ఏళ్ల క్రితం తన స్వగ్రామానికి దూరమయ్యాడు. ఆ తర్వాత అతను తిరిగి తన ఇంటికి పోలేదు." అని సామాజిక కార్యకర్త అష్రఫ్ తామరస్సేరి చెప్పారు. అయితే, చాలా నెలలుగా కొడుకుతో సంబంధాలు తెగిపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు అతనిని కలవడానికి యూఏఈకి వచ్చారు. చివరకు అతని చిరునామా తెలుసుకొని తలుపులు తట్టారు. అతను మరణించాడనే విషయం తెలుసుకొని భోరుమన్నారు. ఆ వ్యక్తి అప్పటికే గుండెపోటుతో మరణించాడు. అయితే, అతను ఒంటరిగా జీవించడం మరియు ఎవరితోనూ పెద్దగా పరిచయం లేని కారణంగా చాలా రోజుల వరకు అతని మృతదేహాన్ని గుర్తించలేదు. దీంతో ఆ తల్లిదండ్రులు మార్చురీకి వెళ్లి అతడి మృతదేహాన్ని గుర్తించారు. " ఆ తల్లిదండ్రుల ముఖాల్లోని బాధను నేను ఎప్పటికీ మరచిపోలేను. నేను చూసిన అత్యంత హృదయ విదారక కేసులలో ఇది ఒకటి." అని అష్రాఫ్ అన్నారు. అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేసిన తర్వాత, వ్యక్తి మృతదేహాన్ని భారతదేశానికి స్వదేశానికి తరలించారు.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









