మస్కట్, సోహార్‌లలో తెల్లవారుజామున 4.30 గంటలకు ‘జైలర్’ ఫస్ట్ షో

- August 09, 2023 , by Maagulf
మస్కట్, సోహార్‌లలో తెల్లవారుజామున 4.30 గంటలకు ‘జైలర్’ ఫస్ట్ షో

మస్కట్: సూపర్ స్టార్, రజనీకాంత్ నటించిన 'జైలర్' మొదటి రోజు మొదటి షో గురువారం మస్కట్, సోహార్‌లో తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రారంభమవుతుంది.  వోక్స్ సినిమాస్ వెబ్‌సైట్‌లో ఈ మేరకు పేర్కొన్నారు. సినీ ప్రియులు అజైబా, సిటీ సెంటర్ మస్కట్, సిటీ సెంటర్ ఖురమ్, మాల్ ఆఫ్ ఒమన్, MGM మరియు సిటీ సెంటర్ సోహార్‌లలో ఉదయం 4.30 గంటలకు టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చని తెలిపారు.  “ఫస్ట్ డే ఫస్ట్ షో తెల్లవారుజామున 4.30కి అది కూడా వర్కింగ్ డేలో చూడడం చాలా అరుదు. ఒమన్‌లో రజనీకాంత్‌కు ఎంత ఆదరణ ఉందో ఇది స్పష్టంగా చూపిస్తుంది” అని భారతదేశంలోని చెన్నైకి చెందిన భారతీయ ప్రవాసుడు సెల్వన్ తెలిపారు.  

రూ.200 కోట్ల (OMR100,000) బడ్జెట్‌తో రూపొందించబడిన ‘జైలర్’ భారతీయ తమిళ భాష బ్లాక్ కామెడీ-యాక్షన్ చిత్రం. దీనికి నెల్సన్ రచన, దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్‌కు చెందిన కళానిధి మారన్ ఈ చిత్రాన్న నిర్మించారు. ఇందులో రజనీకాంత్ టైటిల్ రోల్‌లో నటించగా.. ఇతర పాత్రల్లో మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, శివ రాజ్‌కుమార్, సునీల్, రమ్య కృష్ణన్, వినాయకన్, మిర్నా మీనన్ మరియు తమన్నా భాటియా నటించారు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత సూపర్‌స్టార్ రజనీకాంత్ వెండితెరపై కనిపిస్తున్న చిత్రం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com