యూఏఈ ఎన్నికలు: మొదటి రోజున 160 రిజిస్ట్రేషన్స్
- August 17, 2023
యూఏఈ: యూఏఈ పార్లమెంటరీ సంస్థ అయిన ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ (FNC)కి పోటీ చేయాలనుకునే వారి నుండి అభ్యర్థనలను స్వీకరణ ప్రారంభమైంది. జాతీయ ఎన్నికల కమిటీ వ్యక్తిగతంగా, ఎలక్ట్రానిక్‌గా నమోదు అభ్యర్థనలను స్వీకరిస్తోంది. ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆసక్తిగల అభ్యర్థులు దేశం లోపల లేదా బయట ఉన్నా సులభంగా నమోదు చేసుకోవచ్చు. అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవారు జాతీయ ఎన్నికల కమిటీ అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా మొబైల్ యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్లు వ్యక్తిగతంగా కూడా చేయవచ్చు. ఆగస్టు 18 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. రిజిస్ట్రేషన్ మొదటి రోజు అన్ని ఎమిరేట్స్ నుండి మొత్తం 162 అభ్యర్థిత్వ అభ్యర్థనలు వచ్చాయి. అబుదాబికి 58, దుబాయ్‌కి 23, షార్జాకు 29, అజ్మాన్‌కు 12, ఉమ్ అల్-క్వైన్కు 12, రస్ అల్ ఖైమాకు 19, ఫుజైరాకు 9 అభ్యర్థనలు అందాయి. ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ ఎన్నికల కాలక్రమం ప్రకారం.. జాతీయ ఎన్నికల కమిటీ అభ్యర్థుల ప్రాథమిక జాబితాను ఆగస్టు 25న ప్రకటిస్తుంది. ఆ తర్వాత అభ్యర్థులకు అభ్యంతరాలను సమర్పించే వ్యవధి వెంటనే ప్రారంభమవుతుంది. అభ్యర్థుల తుది జాబితా సెప్టెంబర్ 2న ప్రకటిస్తారు. ఆ తర్వాత అభ్యర్థులు తమ ఎన్నికల కార్యక్రమాలను, ప్రచారం చేయడం ప్రారంభించవచ్చు.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









