తీరప్రాంతాలలో గోడలను నిర్మించనున్న బహ్రెయిన్

- August 20, 2023 , by Maagulf
తీరప్రాంతాలలో గోడలను నిర్మించనున్న బహ్రెయిన్

బహ్రెయిన్: ఇప్పటికే విపరీతమైన ఉష్ణోగ్రతలతో పోరాడుతున్న బహ్రెయిన్ మరొక పర్యావరణ ముప్పును నివారించడానికి సిద్ధమవుతోంది. క్రమంగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని, దాని కారణంగా తీరంలోని కొన్ని భాగాలు మునిగిపోయే ప్రమాదం ఉందని బహ్రెయిన్ చమురు మరియు పర్యావరణ మంత్రి డాక్టర్ మొహమ్మద్ బిన్ ముబారక్ బిన్ డైనా వెల్లడించారు. వచ్చే ఏడాది నాటికి బీచ్‌లను విస్తరించడం, ఎత్తైన సముద్ర గోడలను నిర్మించడం, తీరప్రాంత రక్షణను నిర్మించడం ప్రారంభిస్తుందని మనామాలోని తన కార్యాలయంలో ఒక ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు.

అధికారిక అంచనాల ప్రకారం.. ఐదు మీటర్ల (16.4 అడుగులు) విపరీతమైన పెరుగుదల దాని అంతర్జాతీయ విమానాశ్రయంతో సహా దేశంలోని చాలా భాగాలు మునిగిపోయే అవకాశం ఉంది. మనామాలోని అరేబియన్ గల్ఫ్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ సబా అల్జెనైడ్ ప్రకారం.. 0.5 నుండి 2 మీటర్ల పెరుగుదల కూడా బహ్రెయిన్ మొత్తం వైశాల్యంలో ఐదు నుండి 18 శాతం వరకు భూభాగం మునిగిపోతుంది. గల్ఫ్‌లో ఉన్న వనరులు అధికంగా ఉన్న దేశాలలో బహ్రెయిన్ మాత్రమే ద్వీప దేశం. దాని జనాభాలో ఎక్కువ భాగం ప్రధాన సౌకర్యాలు నీటి నుండి ఐదు మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న లోతట్టు తీర ప్రాంతాలలో ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్ మంచు పలకలు, హిమానీనదాలను కరగించడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ద్వీపాలు కూడా సముద్రాల పెరుగుదల నుంచి ముంపును ఎదుర్కొంటున్నాయి.

1976 నుండి ప్రతి సంవత్సరం సముద్ర మట్టాలు 1.6 మిల్లీమీటర్లు,  3.4 మిల్లీమీటర్ల మధ్య పెరుగుతున్నట్లు బహ్రెయిన్ అధికారులు ఇప్పటికే అంచనా వేశారని  మంత్రి చెప్పారు. కానీ 2050 నాటికి సముద్ర మట్టాలు కనీసం 0.5 మీటర్లు పెరుగుతాయని, వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్‌ను ఉటంకిస్తూ మంత్రి తెలిపారు. అందుకే బహ్రెయిన్ యొక్క ప్రధాన ప్రాధాన్యతలలో ఒకటి సముద్ర మట్టం పెరుగుదల అని బిన్ డైనా చెప్పారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com