ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన స్వామి బ్రహ్మవిహారిదాస్

- August 20, 2023 , by Maagulf
ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన స్వామి బ్రహ్మవిహారిదాస్

న్యూఢిల్లీ: భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని BAPS స్వామినారాయణ్ సంస్థకు చెందిన స్వామి బ్రహ్మవిహారిదాస్ కలిసారు. ఈ సందర్భంగా మోదీకి అమెరికాలోని రాబిన్స్‌విల్లేలోని స్వామినారాయణ అక్షరధామ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న 'ఫెస్టివల్ ఆఫ్ ఇన్‌స్పిరేషన్స్' అప్‌డేట్‌తో పాటు BAPS జరుపుకోబోయే 'ఫెస్టివల్ ఆఫ్ హార్మొనీ' వివరాలను స్వామి బ్రహ్మవిహారిదాస్ పీఎం మోదీకి తెలియజేశారు. 2024 ఫిబ్రవరి 14న ప్రారంభం కానున్న అబుధాబిలోని హిందూ మందిర్ ప్రపంచ ప్రయోజనాల కోసం చేస్తున్న సార్వత్రిక సామాజిక, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక కృషిని ప్రధాన మంత్రి అభినందించారు.  ఈ సందర్భంగా స్వామీజీకి శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రేమ, శాంతి మరియు సామరస్యానికి ప్రతీగా నిలచే ఐకానిక్ మందిర్ 3D నమూనాను ప్రధానికి బహుకరించారు .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com