అబుధాబిలో Dh100,000 గ్రాంట్‌తో కమ్యూనిటీ ప్రోగ్రామ్
- August 21, 2023
యూఏఈ: అథారిటీ ఆఫ్ సోషల్ కంట్రిబ్యూషన్ (Ma'an) కొత్త కమ్యూనిటీ వాలంటీరింగ్ ప్రోగ్రామ్ 2023ని Dh100,000 గ్రాంట్ తో ప్రారంభించింది. మాన్ కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ మరియు వాలంటీరింగ్ విభాగం డైరెక్టర్ మైసా అల్నువైస్ మాట్లాడుతూ.. లాభాపేక్షలేని, సామాజిక సంస్థలు, కమ్యూనిటీ వాలంటీర్ల మూడవ రంగానికి మద్దతు ఇవ్వడం, రాజధానిలో సామాజిక సవాళ్లను పరిష్కరించడం ద్వారా వినూత్న పరిష్కారాలను అందించడానికి అవకాశాలను అందించడం ఈ ప్రోగ్రామ్ లక్ష్యం అన్నారు. “కొత్త కమ్యూనిటీ వాలంటీరింగ్ ప్రోగ్రామ్ గ్రాంట్ 2023 లైసెన్స్ పొందిన లాభాపేక్ష లేని సంస్థలు, సామాజిక సంస్థలు, వాలంటీర్ గ్రూపులు, విద్యాసంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థలకు మద్దతు ఇవ్వడానికి Dh100,000 వరకు గ్రాంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది.”అని అల్నువైస్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, పర్యావరణం, ఒంటరితనం, గృహ హింస, మాదకద్రవ్య దుర్వినియోగం, స్త్రీ సాధికారత వంటి సామాజిక ప్రాధాన్యతలను సూచించే 27 ప్రోగ్రామ్ కాన్సెప్ట్‌లు ఉన్నాయని తెలిపారు. సహకార, సంఘటిత కమ్యూనిటీలను అభివృద్ధి చేయాలనే మాన్ వ్యూహాత్మక లక్ష్యానికి బలమైన, క్రియాశీలమైన మూడవ రంగాన్ని ప్రారంభించడం చాలా కీలకమని అల్నువైస్ తెలిపారు. తమ కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లు 1,300 కంటే ఎక్కువ మంది వాలంటీర్లకు వాలంటీర్ అవకాశాలను అందించడంలో కీలక పాత్ర పోషించాయన్నారు. ఇది 2021తో పోల్చితే 400 శాతం పెరిగిందన్నారు. 2023 మంజూరుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం, మాన్ కమ్యూనిటీ వాలంటీరింగ్ ప్రోగ్రామ్ (CVP) (qualtrics.com)ని సందర్శించాలని కోరారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









