బహ్రెయినీలకు ఉద్యోగాలిస్తే రివార్డులు

- May 18, 2016 , by Maagulf
బహ్రెయినీలకు ఉద్యోగాలిస్తే రివార్డులు

బహ్రెయినీ లెజిస్లేటర్‌ ఒకరు, తమ కంపెనీల్లో బహ్రెయినీలకు ఉన్నత స్థానాల్లో అవకాశమిస్తే, ప్రభుత్వం రివార్డు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పార్లమెంట్‌లో జరిగిన సమావేశంలో ఎంపీ అదెల్‌ హమీద్‌, లేబర్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ మినిస్టర్‌ జమీల్‌ హుమైదాన్‌తో మాట్లాడుతూ, పలు సూచనలు చేశారు. మినిస్టర్‌ చెప్పిన వివరాల ప్రకారం 7000 మంది బహ్రెయినీలు నిరుద్యోగులుగా ఉన్నారనీ, వీరిలో ఎక్కువగా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు మహిళలు ఉన్నారని వెల్లడయ్యింది. ప్రైవేటు సెక్టార్‌లో కొందరు, బహ్రెయినీలకు చిన్న చిన్న ఉద్యోగాలతో సరిపెడుతున్నారనీ, ఉన్నత స్థానాల్లో ఉద్యోగాలు కల్పించే సంస్థలకు రివార్డు ప్రకటిస్తే అది బహ్రెయినీలకు గౌరవం దక్కేలా మిగతా సంస్థలపై ఒత్తిడి పెరుగుతుందని అదెల్‌ హమీద్‌ చెప్పారు. మినిస్టర్‌ హుమైదాన్‌, అదెల్‌ హమీద్‌ సూచననలు ఆహ్వానించారు. బహ్రెయిన్‌లో మహిళా నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారనీ, వారికి ఉద్యోగాలు కల్పించే దిశగా ఉన్న అవకాశాలన్నిటినీ పరిశీలిస్తామని మంత్రి చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com