అక్కడా మహేష్ ఖాళీగా లేరట.!

- August 29, 2023 , by Maagulf
అక్కడా మహేష్ ఖాళీగా లేరట.!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘గుంటూరు కారం’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే, రాజమౌళితోనూ ఓ ప్యాన్ ఇండియా సినిమాని గతేడాదే అనౌన్స్ చేశాడు మహేష్ బాబు.

ఓ పక్క ‘గుంటూరు కారం’ సినిమాతో బిజీగా వున్నప్పటికీ, రాజమౌళి సినిమాకి సంబంధించిన అప్డేట్ కావాలంటూ ప్యాన్స్ మహేష్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నారు.

దాంతో, గ్యాప్ దొరికినప్పుడల్లా విదేశాల్లో రాజమౌళితో సిట్టింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాడట మహేష్ బాబు. ఈ సినిమా గ్లోబ్ ట్రోటింగ్ నేపథ్యంలో వుంటుందనీ గతంలోనే రాజమౌళి కాన్సెప్ట్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే.

దీనికి సంబంధించి హాలీవుడ్ రేంజ్‌లో మేకింగ్ వుంటుందట. ఎక్కువ భాగం విదేశీ లొకేషన్లలోనే ఈ సినిమా తెరకెక్కించాలనుకుంటున్నాడట రాజమౌళి. ఆ లొకేషన్ల సెర్చింగ్ నిమిత్తమే అడపా దడపా విదేశీయానం చేస్తున్నాడట. 

పనిలో పనిగా మహేష్ టూర్స్‌లో భాగంగా వీలు చిక్కినప్పుడల్లా అక్కడే సిట్టింగ్ ప్రోగ్రామ్స్ కూడా కానిచ్చేస్తున్నారట. అదీ సంగతి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com