అనుపమకి ఆ బిగ్ ప్రాజెక్ట్ నిజమేనా.?

- August 29, 2023 , by Maagulf
అనుపమకి ఆ బిగ్ ప్రాజెక్ట్ నిజమేనా.?

ఇంతవరకూ చిన్నా చితకా సినిమాలతోనే సరిపెట్టుకున్న అనుపమ పరమేశ్వరన్ ఇకపై బిగ్ ప్రాజెక్టులు టేకప్ చేయబోతోందనీ తాజా సమాచారం.
 
ఓ స్టార్ హీరో సినిమాలో అనుపమకి చాన్స్ దక్కిందట. ఆ ఛాన్స్ దక్కించుకున్నందుకు అనుపమ ఎగిరి గంతేస్తోందట. గతంలో అనుపమతో కలిసి పని చేసిన ఓ స్టార్ డైరెక్టరే ఆమెకు ఈ ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

ఒకవేళ ఇదే నిజమైతే, అనుపమ దశ తిరిగినట్లే. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ ‘టిల్లు స్క్వేర్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా కోసం అనుపమ గ్లామర్ తెరలు పూర్తిగా తెంచేసింది. హద్దుల మీరిన గ్లామర్‌తో శాంపిల్ టచ్ ఇస్తూ వస్తోంది. సినిమాలో ఈ టచ్ మరింత ఎక్కువ వుండబోతోందనీ సంకేతాలు పంపిస్తోంది అనుపమ.

బహుశా పర్‌ఫామెన్స్ ఓరియెంటెడ్ నటి నుంచి, కమర్షియల్ హీరోయిన్‌గా ప్రమోట్ అయ్యేందుకు ‘టిల్లు స్క్వేర్’ అనుపమకి బాగా కలిసొచ్చేట్లుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com