ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ లో ఉద్యోగాలు

- September 01, 2023 , by Maagulf
ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ లో ఉద్యోగాలు

ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIASL)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 998 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో హ్యాండీమ్యాన్ , యుటిలిటీ ఏజెంట్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

భర్తీ చేయనున్న 998 పోస్టులలో 971 ఖాళీలు హ్యాండీమ్యాన్ పోస్టులు కాగా, యుటిలిటీ ఏజెంట్ 20 పురుషులకు 7 మహిళలు కోసం కేటాయించారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి హ్యాండీమ్యాన్ పోస్టులకు SSC /10వ తరగతి ఉత్తీర్ణత. ఇంగ్లిష్ లాంగ్వేజ్ చదివి అర్థం చేసుకోగలగాలి. స్థానిక మరియు హిందీ భాషల పరిజ్ఞానం, అంటే అర్థం చేసుకోవడం , మాట్లాడే సామర్థ్యం అవసరం. యుటిలిటీ ఏజెంట్ పోస్టులకు గాను SSC /10వ తరగతి ఉత్తీర్ణత. స్థానిక హిందీ భాషల పరిజ్ఞానం, అంటే అర్థం చేసుకోవడం మరియు మాట్లాడే సామర్థ్యం అవసరం. అభ్యర్ధుల వయస్సు 33 సంవత్సరాల లోపు ఉండాలి.

ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఈ పోస్ట్‌లకు సెప్టెంబర్ 18, 2023లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆప్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను టెస్టిమోనియల్‌లు/సర్టిఫికెట్‌ల కాపీలతో పాటు పోస్ట్ ద్వారా లేదా డ్రాప్-బాక్స్ ద్వారా వ్యక్తిగతంగా పంపాల్సి ఉంటుంది.

ఎంపికైన వారికి నెలకు ప్రారంభ జీతంగా హ్యాండీ మ్యాన్ కు -21,330/- యుటిలిటీ ఏజెంట్ (పురుషుడు)-21,330/- చెల్లిస్తారు. దరఖాస్తులు అందించాల్సిన చిరునామా ; HRD డిపార్ట్‌మెంట్, AI ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్, GSD కాంప్లెక్స్, సహార్ పోలీస్. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ;https://www.aiasl.in/పరిశీలించగలరు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com