ప్రముఖ అనస్థీషియా స్పెషలిస్ట్ డా.సౌజన్య ముత్యాలతో ముఖాముఖి...
- September 03, 2023అనస్థీషియాలజిస్ట్..సంస్కృతంలో 'వేదనోపశమన వైద్యహ' అని నిర్వచనం.
ప్ర): మత్తు వైద్యుడు లేదా అనస్థీషియాలజిస్ట్ ఏమేం చేస్తారు.?సర్జరీ సమయంలో తప్ప మత్తు వైద్యుడి అవసరం వుండదా.?
జ): అనస్థీషియాలజిస్ట్ ఆవసరం కేవలం శస్త్ర చికిత్స సమయంలో ఆపరేషన్ థియేటర్ వరకే పరిమితం కాదు.
ఐసీయూలో అతి క్లిష్టమయిన వెంటిలేటరీ సపోర్ట్ ని అందించటం నించి అన్ని క్రిటికల్ కేసులకి బాధ్యత వహించేది అనస్థీషియాలజిస్ట్ కం ఇంటెన్సివిస్ట్ అని కొద్దీ మందికే తెలుసు
ఎమర్జెన్సీ కేర్ లో కార్డియాక్ అరెస్ట్ ,గుండె ఊపిరి ఆగిపోయిన క్లిష్ట పరిస్థితిలో కార్డియో పల్మనరీ rescusitation CPR తో ప్రాణాలు కాపాడే టీం లీడర్ పాత్ర అనస్థీషియాలజిస్ట్ ఇంటెన్సివిస్ట్ డే.
స్త్రీ మాతృమూర్తి అయ్యే సమయంలో పడే తీవ్రమయిన పురిటి నొప్పుల్ని కూడా ఎపిడ్యూరల్ పధ్ధతి ద్వారా తొలగించే సమర్థత అనస్థీషియాలజిస్ట్ కే ఉంది.
అదే విధంగా పెయిన్ క్లీనిక్ ద్వారా దీర్ఘకాలిక నొప్పులతో అవస్థ పడే వారికీ ఉపశమనం కలిగించే ఎన్నో వైద్య విధానాలు అనస్థీషియాలజిస్ట్ మాత్రమే చేయగలరు.
ప్ర): ఈ మధ్య తరచూ పెయిన్ మేనేజిమెంట్ అనే మాట వింటున్నాం.మత్తు వైద్యుడి పాత్ర ఇందులో ఎంత?
జ): మనిషిని వేదించే పలు రకాల శారీరక రుగ్మతల వల్ల కలిగే నొప్పిని నివారించే జ్ఞానం మరియు విధానాలలో అనేస్తేషలోజిస్టలు శిక్షణ కలిగి ఉంటారు. ఉదాహరణకి కాన్సర్ పెయిన్, క్రానిక్ పెయిన్ అనగా దీర్ఘకాలిక నొప్పులు, సిక్ల్ సెల్ క్రైసిస్ లాంటి అతి తీవ్ర నొప్పులకు అవసరమ్యే కంట్రోల్డ్ డ్రగ్స్ ని అనస్థీషియాలజిస్ట్ మాత్రమే ఇవ్వగలరు.
ప్ర): రోగికి ఎంత మేర మత్తు మోతాదు ఇవ్వాలనేది ఎలా నిర్ధారిస్తారు.?
జ): అనస్థీషియా అంటే ఎదో కేవలం ఒక సూది గాని గ్యాస్ గాని ఇఛ్చి మత్త్తు లో కి తీస్కుని వెళ్ళటం కాదని ఇప్పటికి అర్థం అయి ఉంటుంది.
బాలన్స్ డ్ అనస్థీషియా-అంటే సంతులనంగా నిస్చేత నావస్థ లో నికి తీసుకుని వెళ్లి తిరిగి మామూలు స్థితి లోకి తీసుకు రావటం.ఇందుకు అనేస్తేషియా వైద్యులు చేసే
లెక్కలు కొలతలు ఈ క్రింది అంశాల పై ఉంటుంది.
-ఏ రకమయిన శస్త్రచికిత్స
-శరీరంలో ఏ భాగానికి శస్త్రచికిత్స
-శస్త్రచికిత్స సమయం
- రోగి వయసు
-మరే ఇతర వ్యాధులు ఉండటం
ప్ర): పసి పిల్లలకు సర్జరీ సమయంలో మత్తు ఇవ్వాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు.?
జ): పిల్లలకి శాస్త్ర చికిత్స చేయవలసి వఛ్చినపుడు అనస్థీషియాలజిస్ట్ పాత్రని
మూడు భాగాలుగా ఉంటుంది .ఆపరేషన్ కి ముందు పిల్లల ఆరోగ్య పరిస్థితిని క్షున్నంగా పరిశీలించి , తగిన విధంగా అనేస్తేషియా ప్లాన్ ని పెద్దలతో చర్చిస్తారు .అలాగే అవసరమైన టెస్ట్ లని సూచిస్తారు.ఆపరేషన్ ని బట్టి ఎలాంటి అనేస్తేషియా అవసరమో వివరించి,పేరెంట్స్ నki కాంఫిడెన్స్ ఇస్తూ భయాన్ని తొలగించే ప్రయత్నం చేస్తారు. పిల్లలకి ఆస్తమా లాంటి మరేదయినా ఇబ్బంది ఉంటె అందుకు తగిన జాగ్రత్త్తలని వివరిస్తారు. ఆపరేషన్ కి ముంఫు ఆహార పానీయాలు ఆపివేయాల్సిన సమయం సూచిస్తారు.
ఇక ఆపరేషన్ థియేటర్ లో చికిత్స ని బట్టి పలు రకాల అనస్థీషియా పద్ధతులు ఉంటాయి.
జనరల్ అనస్థీషియా-పూర్తి శరీరాన్నీ నిశ్చేతనం చెయ్యటం.
రీజినల్ అనస్థీషియా-కాడల్,స్పైనల్ లేదా నెర్వ్ బ్లాక్ అవసరమైన శరీర భాగానికి నొప్పి లేకుండా చేయటం ఇది జనరల్ లేదా సెడేషన్ తో పాటు చేస్తారు.
ప్ర): వృద్ధులకు సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు, మత్తు వైద్యుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి.?
జ): పిల్లలలో లాగగానే వృద్ధుల లో జాగ్రత్తలు అవసరం.వృద్ధాప్యం తో కూడిన శారీరక బలహీనతలే కాక వయసుతో వచ్ఛే రుగ్మతల్ని దృష్టిలో ఉంచుకోవలసి వస్తుంది. ఉదాహరణకి సామాన్యంగా వచ్ఛే హైపెర్టెన్షన్ (BP),డయాబెటిస్( షుగర్ వ్యాధి), గుండె జబ్బు,ఇతరత్రా వయసుతో క్రమంగా మెటబాలిజం (జీవక్రియ) లో కలిగే మార్పులు అనస్థీషియా విధానం పై ప్రభావం ఉంటుంది.అలాగే వారు వాడే మందుల వల్ల కలిగే మార్పులని, అనేస్తేషియా పై వాటి ప్రభావాన్ని విశ్లేషించుకోవలసి వస్తుంది. అందుకు అనుగుణంగా మోతాదుని సరిచేసుకోవలసి వస్తుంది.
ప్ర): సర్జరీకి ముందు మత్తు ఇచ్చేటప్పుడు.. ఎలాంటి అస్సెస్మెంట్ జరుగుతుంది.?
జ): ప్రీ అనేస్తేషియా అసెస్మెంట్ క్లినిక్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆస్పత్రులలో తప్పనిసరి చేసారు.సర్జరీ కి ముందు అనస్థీషియాలజిస్ట్ రోగిని పరిచయం చేసుకొని పరీక్షించే క్లినిక్.
మొదట మీరు ఎలాంటి సర్జరీ కి వస్తున్నారో మరే ఇతర వ్యాధులు రుగ్మతలు ఉన్నయామో తెలుసుకుంటారు అనస్థీషియాలజిస్ట్.
స్మోకింగ్ ( పొగ త్రాగటం), ఆల్కహాల్ ( మద్యం) సేవించే అలవాటు, పొగాకు, డ్రగ్స్ ( మత్తుమందులు)లాంటి అలవాట్లని అడిగి తెలుసుకుంటారు.
మీకు ఏవయినా పడని మందులు గాని, ఎలర్జీ గాని ఉన్నదేమో అడిగి తెలుసుకుంటారు.
తరువాత ముఖ్యమయిన ఫిసికల్ ఎక్సమినేషన్ లో గుండె, ఊపిరితిత్తులు స్టెతస్కోప్ తో పరిశీలించి అనేస్తేషియా కి అతి ముఖ్యమైన ఎయిర్ వే అసెస్మెంట్ చేస్తారు.
ఎయిర్ వే అసెస్మెంట్ లో మీ నోటి పెళ్లా నుండి ఊపిరితిత్తుల దాక ఉండే వాయు/ ఊపిరి మార్గం అంచనా వేయటం.చదవటానికి భయంగా ఉన్నదా!!?
అవును మరి,మీకు సర్జరీ సమయంలో జనరల్ అనేస్తేషియా అవసరమయితే, మీ
శ్వాసనాళములోకి ఏందో ట్రెక్యాల్ ట్యూబ్ వేసి ఊపిరినిచ్చేది అనస్థీషియాలజిస్ట్ కదా మరి.
ఇక ఆ నిర్దిష్ట చికిత్సకి అవసరమయ్యే అనేస్తేషియా పద్దతిని మీకు వివరబుగా తెలియజేసి, అందుకు అవసరమ్యే రక్త పరీక్షలు, ఎక్స్ రే, ఈ.సి.జి లాంటి ప్రాథమిక పరీక్షలను పరిశీలిస్తారు.సర్జరీ అనేస్తేషియాలకు ముందు పాటించవలసిన నియమనిబంధనాలని సూచిస్తారు.ఉదాహరణకి ఆహారపానీయాలు ఎంత సమయం ముందు మానివేయాలి, మనం ఏవయినా మందులు వాడుతున్నట్లయితే సర్జరీ అనస్థీషియాల ముందు వాటి వాడకం మొదలయిన విషయాల గురించి చెప్తారు.
అలాగే ఏదయినా క్లిష్ట స్థితి ఉన్నట్లయితే మరి కొన్నిఅవసరమయిన పరీక్షల్ని ఆదేశించవచ్చు ఈ అన్ని అంశాల ఆధారంగా తగిన అనస్థీషియా ని నిర్ధారణ చేసి, అందువల్ల తారసపడే సామాన్య సమస్యలు ఉదా, కొంత మందికి వికారం,వాంతులు,తలా తిప్పటం లాంటివి),రోగి స్థితిని బట్టి మారే మరే ఇతర సమస్యలని గ్రహింప చేస్తారు.
అనస్థీషియా పై మీకుండే సందేహాల్ని తీర్చే ప్రయత్నం చేసి, ఊరట కలిగించే ప్రక్రియ లో భాగమే ప్రీ అనస్థీషియా అసెస్మెంట్.
ప్ర): సర్జరీ చేసే వైద్యులతోపాటే మీరూ అక్కడే వుంటారా.?
జ): అవును.సర్జరీ కి ముందు ఆపరేషన్ థియేటర్ రిసెప్షన్ మొదలుకొని సర్జరీ అయిపోహి పోస్ట్ అనేస్తేషియా కేర్ యూనిట్ రికవరీ వరకు అనేస్తేషలోజిస్ట్ తోనే ఉంటారు
ప్ర): సర్జరీ అనంతరం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు.?
జ): సర్జరీ అనంతరం అనేస్తేషలోజిస్ట్స్ తీసుకునే జాగ్రత్తలు...
-మీరు పూర్తిగా అనేస్తేషియా నుండి కోలుకున్నారని నిర్ధారించుకున్నాకే
పోస్ట్ అనస్థీషియా కేర్ యూనిట్ కి తరలిస్తారు అందుకు నిర్ణయించే పారామితులు మీ ఊపిరి తీసుకునే ప్రక్రియ,ఆక్సిజన్ పరిమాణం (సాతురేషన్),చేతనా స్థాయి,,
నాడి వ్యవస్థ,సర్జరీ నొప్పి తెలియకుండా ఉండటం సర్జరీ, అనస్థీషియా కలయికలో పొందిన మందులు,గ్యాస్ ల ప్రభావం పూర్తిగా పోయేందుకు కొంత సమయం కావచ్చు.
అందుకు కొంతసేపటి దాక ఆహారపానీయాలు నిలుపుదల చేసి క్రమంగా మొదలుపెడతారు.అలాగ సర్జరీ ని బట్టి నొప్పి నివారణకు మండీలతో జాగ్రత్తలు తీసుకుంటారు.అన్ని సానుకూలిస్తేనే రూమ్ కి గని వార్డ్ కి గని తరలిస్తారు.
మేజర్ సర్జరీ,లేదా ముఖ్య అవయవాల శాస్త్రకేజికిత్స లో (గుండె మెదడు కాలేయం) అవసరాన్ని బట్టి ఐ.సి.యూకి తరలించి పర్యవేక్షిస్తారు.
ప్ర): ఒక్కోసారి సర్జరీ జరుగుతున్నప్పపుడే మత్తు వికటించడం అనేది జరిగితే.. ఏం చేస్తారు.?
జ): జనరల్ అనస్థీషియా సమయంలో మీ కీలక అవయవ వ్యవస్థ నిరంతర పరిశీలనలో ఉంటుంది.ఎలెక్ట్రోడ్స్ ,బి.పీ, ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు, బై స్పెక్ట్రల్ ఇండెక్స్, నెఉరోముస్క్యూలర్ మానిటర్,లాంటి కీలక అంశాల ద్వారా అనస్థీషియా మోతాదుని అంచనా వేస్టూ ఏమాత్రం మేలుకొని soo కలిగినా అందుకు అవసరమ్యే మోతాదులో అనేస్తేషియా ని సవరిస్తారు.
ప్ర): సర్జరీ అనంతరం పెయిన్ రిలీఫ్ విషయంలో మత్తు వైద్యుడి పాత్ర ఎంత.?
జ): ఓ చిన్న సూది గుచ్చుకున్నా, లేదా కిచెన్ లో కూరలు తరుగుతూ పొరపాటుగా కత్తి తగిలిన ఏంటో వేదన పడటం. అలాంటిది మీ పొట్టని,ఛాతీని, గుండెని, మెదడుని, సర్జరీ లో ఎక్కడ ఎంత కోసి కెలికినా, ఏ మాత్రం నొప్పి తెలియకుండా చేయగల అనస్థీషియా ఎంత అద్భుతమయిన శాస్త్రమో కదా!
సర్జరీ తర్వాత మొదటి 24 గంటలు నొప్పిని సంబాళించే వైద్యులు అనేస్తేషలోజిస్ట్స్ లే.
అంటే కాదు, అతి క్లిష్ట సర్జరీ లలో సైతం, అనేక పెయిన్ మనగెమెంత్ టెక్నిక్స్ తో నొప్పి. నీవా రించగల సమర్థత కేవలం అనేస్తేషలోజిస్ట్ మాత్రమే చేయగలరు.
ప్ర): అత్యంత సంక్లిష్టమైన బ్రెయిన్ సర్జరీ వంటివాటి విషయంలో మత్తు వైద్యులుగా మీరెలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు.?
జ): మెదడు శస్త్రచికిత్సలో అనస్థీషియా సంరక్షణ ఏంటో క్లిష్టమైనది కీలకమైనది . అందుకు అనేస్తేషలోజిస్ట్ అత్యంత కీలక పాత్ర వహిస్తారు. బ్రెయిన్లోని కణాలు సరిగా పనిచేసేందుకు తాహిన ఆక్సిజన్ carbon డయాక్సైడ్ స్థాయిలు, షుగర్ ఎలెక్ట్రోలైట్స్ బాలన్స్, అందుకు తగిన రక్త ప్రసరణ ని మైంటైన్ చేయటం అనస్థీషియాలజిస్ట్ బాధ్యత తీసుకుంటారు
ప్ర): శరీరానికి మత్తు ఇచ్చేసినా, బ్రెయిన్ యాక్టివ్గానే వుంటుందంటారు..నిజమెంత.?
జ): మనం ఎంతటి నిద్రావస్థలో గాని లోతైన ధ్యానంలో గాని ఉన్నా కాస్త నొప్పి కలిగిందంటే మేలుకొంటాం, అది బ్రెయిన్లోని నాడీకణాలు ప్రకోపించటం వలన జరుగుతుంది
జనరల్ అనేస్తేషియా అంటే.రెవెర్సిబుల్ కోమా అనవచ్చు, అంటే మందుల ద్వారా పూర్తి నిస్చేతనావస్థ లోనికి తీస్కుని వెళ్లి తిరిగి వ్యాకోపింపచేయటం. ఇలాంటి పరిస్థితిలో బ్రెయిన్ న్యూరాన్లు నాడి కణముల సంకేతాలు మాములు స్థితి కంటే కూడా ఓ క్రమ పద్దతితో వ్యవహరిస్తాయని పరిశోధనల్లో వెల్లడి అయింది. కానీ నొప్పి గని మారె జ్ఞాపకం కానీ మీకు కలగదు.. ఒకవేళ కలలు వచ్చే ఉన్నా జ్ఞాపకం ఉండే అవకాశం ఉండదు.
ప్ర): సర్జరీల సమయంలో మత్తు వైద్యులది కీలక పాత్ర. కానీ, మత్తు డాక్టర్.. అని చిన్న చూపు చూడటం పరిపాటి. మీరేమంటారు.?
జ): ఈ ప్రపంచంలో ఏ జీవరాశికయినా నొప్పి అంటే భయమే. ఆ నొప్పి ఎటువంటిదయినా దాన్ని జయించటం కోసం mana ఆ ప్రయత్నాలు చరిత్రలో ఎన్నో జరిగాయి. ఆలా ఎందరో మహానుభావుల శ్రమ త్యాగాల వలనే ఈనాడు మనం మోడరన్ అనేస్తేషియా విధానాలని పెంపొందించగలిగాం, నొప్పిని జయించగలిగాం.
జార్జ్ బెర్నార్డ్ షా అనేస్తేషియా విలువని తెలుపుతూ, తన డాక్టర్స్ డైలమా అనే పుస్తకంలో
ఇలా అంటారు " నీలోకి ఎన్ని కత్తులు దిగిన, ఏ మాత్రం నొప్పి తెలియకుండా చేసి, సర్జరీ సమయంలో జీవవాయువునిస్తూ, ఏ ప్రాణం నిలిపే అనేస్తేషలోజిస్ట్ లేకపోతె, సర్జరీ అనాగరికమైన కసాయితనమీ కదా.ఆ కసాయితనానికి ఓ స్థాయినిచ్చి విలువనిచ్చే అనేస్తేషియా, అనేస్తేషలోజిస్ట్స్ అత్యంత గౌరవనీయులు".
ఈ అవగాహనా రాహిత్యం శోచనీయమే!
కానీ కాలంతో పాటు,ముఖ్యనగ మొన్నటి కరోనా మహమ్మారి తో మానవజాతి తల్లడిల్లినపుడు శ్వాసనిచ్చి జీవితాన్ని రక్షించే విధానంలో అనస్థీషియాలజిస్ట్ కీలక పాత్ర ఐ గ్రహించగలిగాం.ఓ ఇంజక్షనో, గ్యాసో ఇస్తే చాలు నిద్ర పోతాం, సర్జరీ అయిపోతుంది అనుకునే రోజులు పోయి అనేస్తేషియా యొక్క క్లిష్టతని, ప్రాముఖ్యతని గ్రహిస్తే అనేస్తేషలోజిస్ట్ పై గౌరవం పెరుగుతుంది.
--డా.సౌజన్య ముత్యాల(ఫకీ యూనివర్సిటీ హాస్పిటల్,దుబాయ్)
తాజా వార్తలు
- టీమిండియా ఆల్రౌండ్ షో….తొలి టీ20లో బంగ్లా చిత్తు
- TANA వైద్యశిబిరం విజయవంతం-550 మందికి చికిత్స
- Systematic Withdrawal Plan (SWP) ప్లాన్ లాభాల గురించి తెలుసా..?
- చెన్నై ఎయిర్ షో లో విషాదం
- గోవా రైల్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చ జెండా
- టీచర్లకు గోల్డెన్ వీసా..అక్టోబర్ 15 నుండి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..!!
- రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తున్న పింక్ సైక్లిస్టులు..!!
- మహ్బూల్లాలో ఇంధన స్టేషన్..తీరిన ప్రయాణికుల కష్టాలు..!!
- సీబ్ ఫామ్లో అగ్నిప్రమాదం..తప్పిన ప్రాణాప్రాయం..!!
- ఎమిరేట్స్ ఐడి లేకుంటే విమానాశ్రయాల్లో కష్టాలు..ప్రవాస భారతీయులకు అలెర్ట్..!!