యూఏఈలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

- September 03, 2023 , by Maagulf
యూఏఈలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

యూఏఈ: గల్ఫ్ సేన జనసేన యూఏఈ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2,  జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు అజ్మన్ మైత్రి ఫామ్స్ నందు జనసేన పార్టీ కార్యాలయంలో అత్యంత ఘనంగా, ఆట పాటలతో ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నటుడు  మరియు జనసేన నాయకుడు పృథ్వి రాజ్ హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో యూఏఈలో ఉన్న జన సైనికులు భారీ సంఖ్యలో సమావేశం అయ్యారు.ఇందులో భాగం గా నా సేన నా వంతు కు గా కోటి రూపాయలు విరాళంలో భాగస్వాములకు ప్రత్యేక ఆహ్వానంతో కృతజ్ఞతలు తెలియజేశారు.
 
గల్ఫ్ సేన జనసేన యూఏఈ ఎక్సిక్యూటివ్ టీమ్ ను 50 మందితో వివిధ కమిటీలు(ఫైనాన్స్, సోషల్ మీడియా,ఈవెంట్స్ అండ్ లాజిస్టిక్, అడ్మిన్ , వేల్ఫేర్ కమ్యూనిటీ, అడ్వైసరీ, ఎన్నారై మహిళా విభాగం) లను పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అనుమతితో ఆరు గల్ఫ్ దేశాల పార్టీ కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషించుచున్న కేసరి త్రిమూర్తులు ఈ సభా ముఖంగా  ప్రకటించారు.ఇటువంటి  కమిటీలు త్వరలోనే పార్టీ ఆదేశాలతో  మిగిలిని గల్ఫ్ దేశాలలో కూడా ఏర్పాటు చేస్తాం అని త్రిమూర్తులు తెలియ చేశారు. ఈ కమిటీ సభ్యుల చేత పృద్వి పార్టీ బలోపేతం కోసం ప్రమాణ స్వీకారం చేయించారు.పృథ్వి రాజ్ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు  కోసం అహర్నిశలు కష్ట పడుతున్న పవన్ కళ్యాణ్ ని రాష్ట్ర ముఖ్య మంత్రిని చేయడంలో కీలక పాత్ర పోషించాలని గల్ఫ్ NRI లను కోరారు.గల్ఫ్ జన సైనికులని ఉద్దేశించి ప్రసంగించి గల్ఫ్ జనసైనికుల పాత్ర జనసేన బలోపేతం లో మరువలేనిది అని నా సేన కోసం నా వంతు కోటి రూపాయలు పార్టీ కోసం గల్ఫ్ దేశాల నుంచి ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు అని ఆయన జనసైనికులను  కొనియాడారు. ఇంకా ముందు ముందు పార్టీ కోసం గల్ఫ్ జనసైనికుల ముఖ్య పాత్ర పోషించి పార్టీ గెలుపు కోసం పని చేయాలి అని ఆయన గల్ఫ్ జనసేన కార్యకర్తలు ను  కోరారు. అలాగే నా సేన కోసం నా వంతు లో భాగం అయిన ప్రతి జనసైనికుడిని పృథ్వి రాజ్ ప్రత్యేకంగా అభినందించారు. జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు ప్రసంగాలతో వారి అభిప్రాయాలను తెలియజేశారు. పార్టీ విజయానికి చేయవలసిన సూచనలు కార్యాచరణను వివరించారు.అనంతరం కార్యనిర్వాహక సభ్యుల ఆధ్వర్యంలో పృథ్వి రాజ్ ఘనంగా సన్మానించారు.తదుపరి కార్యక్రమం కేక్ కటింగ్ తో పవన్ కళ్యాణ్ కి  గల్ఫ్ సేన జనసేన ద్వారా శుభాకాంక్షలు తెలియపరిచారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com