తెలంగాణలో రానున్న 5 రోజులు వానలు
- September 03, 2023
హైదరాబాద్: తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. కాగా, వర్షాలు కంటిన్యూ అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న 5 రోజులు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
హైదరాబాద్ లో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఇప్పటికే 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సెప్టెంబర్ నెలలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ చెప్పింది.
ఈ రోజు(సెప్టెంబర్ 3) తెల్లవారుజాము నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చాలా చోట్ల 11 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. మరో 5 రోజులు ఉమ్మడి పది జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉందన్నారు. ఉత్తర తెలంగాణలో 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
నిన్నటి వరకు ఎండలు మండిపోయాయి. వాతావరణం సెకండ్ సమ్మర్ ను తలపించింది. మండుటెండలు ఠారెత్తించాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తీవ్రమైన వేడి, ఉక్కపోతతో జనాలు విలవిలలాడిపోయారు. రుతుపవనాలు ముఖం చాటేశాయి. వాన జాడే లేకుండా పోయింది. దీంతో జనాలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. గతేడాదితో పోలిస్తే ఆగస్టు నెలలో అతి తక్కువ వర్షపాతం నమోదైంది.
ఇప్పుడు విస్తారంగా వానలు పడుతుండటంతో వాతావరణం చల్లబడింది. ఉక్కపోత నుంచి ఉపశమనం లభించడంతో జనాలు ఊపిరిపీల్చుకున్నారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత తెలంగాణలో మళ్లీ వానలు పడుతున్నాయి. ఆగస్టు మొదటి వారంలో వానలు పడ్డాయి. ఆ తర్వాత వానల జాడే లేదు. ఇప్పుడు అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తుండటంతో రిలీఫ్ గా ఫీల్ అవుతున్నారు. అటు అన్నదాతల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







