కృతిసనన్ చెల్లెలి విషయంలో అంత కేర్ తీసుకుంటోందా.?
- September 05, 2023
కృతి సనన్ చెల్లెలు నుపుర్ సనన్ ‘టైగర్ నాగేశ్వరరావు’ ద్వారా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో కృతి సనన్ అనుకున్న రేంజ్‌లో సక్సెస్ కాలేదు. కానీ, తన చెల్లెలిని మాత్రం ఓ ప్లాన్ ప్రకారం సక్సెస్ చేయాలనుకుంటోందట కృతి సనన్.
ఆ రకంగానే తొలి సినిమా నుంచీ నుపుర్ సనన్‌ని బాగా షైన్ చేస్తోందట. కొత్త ప్రాజెక్టులేమైనా వస్తే, ఫైనల్ డెసిషన్ తానే తీసుకుంటోందట. ఈ మధ్యనే ఓ నిర్మాత, యంగ్ డైరెక్టర్ కథ తీసుకుని వస్తే, ఏదైనా మా అక్కతోనే సంప్రదించండి.. అని నుపుర్ సనన్ చెప్పిందట.
అలా చెల్లెలి కెరీర్ విషయంలో కృతి సనన్ కేరింగ్ అందరికీ షాకిస్తోంది. చూస్తుంటే, కృతి సనన్ తన చెల్లెలు నుపుర్‌ని టాలీవుడ్‌లో స్టార్‌ని చేసే వరకూ ఊరుకునేలా లేదనిపిస్తోంది.
తానెలాగూ బాలీవుడ్‌లో స్టార్‌గా కొనసాగుతోంది. సో, చెల్లెలికి టాలీవుడ్ అప్పగించాలనుకుంటోంది కాబోలు. ఏది ఏమైనా చెల్లెలి కెరీర్ గురించి కృతి తీసుకుంటున్న జాగ్రత్తకి శభాష్ అనాల్సిందే.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..