తొక్కే కదా అని తీసేస్తే ఆరోగ్యం అంతే సంగతి.!
- September 07, 2023
చాలా రకాల కూరగాయల్ని తొక్కలు తీసేసి తింటుంటాం. కానీ, కొన్ని రకాల కూరగాయల తొక్కల్లో అంతులేని విటమిన్లూ, ఖనిజాలు నిండి వుంటాయ్. వాటిని చెక్కి డస్ట్ బిన్‌లో పడేస్తే, ఆరోగ్యాన్ని కూడా డస్ట్ బిన్‌లో పడేసినట్లే.
ముఖ్యంగా సొరకాయ్, బీరకాయ్ వంటి కూరగాయల తొక్కలను అస్సలు పాడు చేయకూడదు. వాటిలో ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలంగా వుంటాయ్.
బీరకాయ్ తొక్కలతో పచ్చడి చేసుకుని తింటే, ఈ పోషకాలన్నీ ఒంటికి పడతాయ్. అలాగే, బీరకాయ తొక్కలతో చేసిన వంటకాన్ని ప్రతీరోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే జీర్ణ వ్యవస్థ చురుకవుతుంది.
బీరకాయ తొక్కల్ని ఎండ పెట్టి, కాస్త పొడి కరివేపాకూ, జీలకర్ర వేసి మిక్కీ చేసి పొడిలా చేసుకుని జాగ్రత్త చేసుకోవచ్చు. ఈ పొడిని ప్రతీ రోజూ అన్నంలో మొదటి ముద్దలో కలిపి తీసుకుంటే, బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
రోగ నిరోధక శక్తి మెండుగా వృద్ధి చెందుతుంది. మలబద్దకం సమస్య తీరుతుంది. ఎముకలు ధృడంగా మారతాయ్. కొలెస్ర్టాల్ తగ్గి ఈజీగా వెయిట్ లాస్ కూడా అవుతారు.
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్లు
- బీచ్లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి