సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్‌తో ప్రధాని మోడీ భేటీ
- September 11, 2023
న్యూఢిల్లీ: భారత్ పర్యటనలో ఉన్న సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్‌తో సోమవారం ప్రధాని మోడీ భేటీ అయ్యారు. వాణిజ్యం, ఆర్థికం, రక్షణ రంగాలతో పాటు సాంస్కృతిక సహకారం వంటి ప్రధాన అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. నేడు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో వ్యూహాత్మక భాగస్వామ్య మండలి మొదటి సమావేశానికి ఇరువురు నేతలు అధ్యక్షత వహించారు. 2019లో రియాద్‌లో భారత్, సౌదీ అరేబియాల మధ్య జరిగిన సమావేశంలో ద్వైపాక్షిక ఒప్పందంపై ఇరు దేశాలు సంతకం చేసిన సంగతి తెలిసిందే. సౌదీ అరేబియా భారత్‌ను అత్యంత సన్నిహిత, వ్యూహాత్మక భాగస్వాములలో ఒకటిగా భావిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ఆ ప్రాంత, ప్రపంచ సంక్షేమం, స్థిరత్వం కోసం ఇరుదేశాల భాగస్వామ్యం కీలకమని అన్నారు. నేటి సమావేశం తమ బంధానికి కొత్త కోణాన్ని ఇచ్చిందని, ప్రజల కోసం పనిచేయడానికి స్ఫూర్తినిచ్చిందని అన్నారు. సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ భారత్‌లో పర్యటించడం ఇది రెండోసారి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







