బహ్రెయిన్ ప్రభుత్వ ఉద్యోగులకు BD3,000 ప్రోత్సాహకం

- September 11, 2023 , by Maagulf
బహ్రెయిన్ ప్రభుత్వ ఉద్యోగులకు BD3,000 ప్రోత్సాహకం

బహ్రెయిన్: బహ్రెయిన్ ప్రభుత్వ రంగంలో అత్యుత్తమ ఉద్యోగులు BD3,000 నగదు ప్రోత్సాహకంగా అందుకుంటారు. ఈ మేరకు రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఆదేశాలు జారీ చేశారు. సివిల్ సర్వీస్ బ్యూరో (CSB)లకు లోబడి ఉద్యోగులకు వేతనాలు, ఉపాధి ప్రయోజనాలు మరియు అర్హత పరిస్థితులను నిర్ణయించే బైలాలోని కొన్ని నిబంధనలను సవరిస్తుందని తెలిపారు.  సవరణలలోని ఆర్టికల్ 56 ప్రకారం, ఆదర్శ ఉద్యోగి ప్రోత్సాహకంగా 1,000 కంటే తక్కువ ఉద్యోగులు ఉన్న ప్రభుత్వ సంస్థల్లో ఒక ఉద్యోగికి బహుమతి ఇవ్వబడుతుంది. 1,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ప్రభుత్వ సంస్థలలో CSB ఆమోదానికి లోబడి ఇద్దరు ఉద్యోగులు ఒకే ప్రోత్సాహకాన్ని పొందుతారు. ఆర్టికల్ 53 ప్రకారం.. BD100- BD500 మధ్య ఒకే మొత్తంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులకు అత్యుత్తమ పనితీరు ప్రోత్సాహకాలను అందించాలని నిర్దేశిస్తుంది. CSB పేర్కొన్న నిబంధనల ప్రకారం.. మునుపటి సంవత్సరం నుండి ఒక సంవత్సరం గడిచే వరకు ఇది మళ్లీ ఇవ్వబడదు. ప్రోత్సాహక భత్యం, పనితీరు-సంబంధిత ప్రోత్సాహక బోనస్ లేదా ప్రమోషన్‌ను ఒక సంవత్సరంలో కలపకూడదని చట్టం పేర్కొంది. ఆర్టికల్ 49 ప్రకారం.. ఉద్యోగులు ఉన్నత స్థాయి ఉద్యోగానికి, పాక్షిక సెకండ్‌మెంట్ లేదా ఉమ్మడి సేవల విధులను నిర్వర్తించడానికి సెకండ్‌మెంట్ చేయబడిన వారు CSB ద్వారా నిర్ణయించబడే వారి ప్రాథమిక వేతనాలలో ఒక శాతంగా సెకండ్‌మెంట్ అలవెన్స్‌ను పొందుతారు.  ఆర్టికల్ 52 ప్రకారం.. ఉద్యోగులకు పనితీరు-ఆధారిత ప్రోత్సాహకాలు, అత్యుత్తమ పనితీరు ప్రోత్సాహకాలు, అసాధారణమైన సాధన ప్రోత్సాహకాలు మరియు ఆదర్శ ఉద్యోగి ప్రోత్సాహకాలు ఇవ్వబడతాయి. ఉద్యోగులు ఒక సంవత్సరంలో రెండు కంటే ఎక్కువ పనితీరు-సంబంధిత ప్రోత్సాహకాలను పొందలేరు.  ఇది అధికారిక గెజిట్‌లో ప్రచురించబడిన తర్వాత అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com