హెలికాప్టర్ సముద్రంలో రెండో పైలట్ కూడా మృతి
- September 11, 2023
యూఏఈ: ఉమ్ అల్ క్వైన్‌లో గురువారం జరిగిన ఏరోగల్ఫ్ 'బెల్ 212' ఛాపర్ క్రాష్‌లో రెండవ పైలట్ కూడా మరణించారు. ప్రమాదం జరిగినప్పటి నుండి రెండో పైలెట్ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు మరణించారని ఏరోగల్ఫ్ ఓ ప్రకటన విడుదల చేసింది. "హెలికాప్టర్ ప్రమాదానికి గురైన సమయంలో అందులో ఇద్దరు పైలెట్లు ఉన్నారు. అందులో ప్రయాణీకులు లేరు. ఇద్దరు సిబ్బంది మరణించినట్లు మేము నిర్ధారించగలము" అని కంపెనీ తెలిపింది. ఏరోగల్ఫ్ ప్రకటన ప్రకారం.. హెలికాప్టర్ అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఆఫ్‌షోర్ రిగ్ మధ్య సాధారణ శిక్షణా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 7న రాత్రి 8.07 గంటలకు యూఏఈ తీరం దగ్గర సముద్రంలో కూలిపోయింది. ఆ మరుసటి రోజు యూఏఈ జనరల్ ఏవియేషన్ అథారిటీ మొదటి పైలట్ మరణాన్ని ధృవీకరించింది. అయితే రెండవ పైలెట్ కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. పైలట్లలో ఒకరిది ఈజిప్టు కాగా, మరొకరిది దక్షిణాఫ్రికా అని ఏవియేషన్ రెగ్యులేటర్ తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







