మొరాకో భూకంప బాధితులను ఆదుకోవడానికి సౌదీ ఎయిర్ బ్రిడ్జి

- September 11, 2023 , by Maagulf
మొరాకో భూకంప బాధితులను ఆదుకోవడానికి సౌదీ ఎయిర్ బ్రిడ్జి

రియాద్: మొరాకో భూకంప బాధితులకు సహాయక సామాగ్రిని అందించడానికి ఎయిర్ బ్రిడ్జ్‌ను ఆపరేట్ చేయాలని రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ లు ఆదివారం కింగ్ సల్మాన్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ అండ్ రిలీఫ్ సెంటర్ (కెఎస్‌ఆర్‌రిలీఫ్)కి ఆదేశాలు జారీ చేశారు. KSR రిలీఫ్ జనరల్ సూపర్‌వైజర్ డాక్టర్ అబ్దుల్లా అల్-రబీహ్ మాట్లాడుతూ.. భూకంపంతో ప్రభావితమైన మొరాకో ప్రజల పక్షాన నిలబడాలని, అలాగే దీని ప్రభావాలను తగ్గించడానికి రాజు, క్రౌన్ ప్రిన్స్ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. వినాశకరమైన భూకంపం భారీ మానవ ప్రాణనష్టం, ఆస్తుల నష్టానికి కారణమైందని తెలిపారు. శుక్రవారం రాత్రి మరకేచ్ నగరం సమీపంలో సంభవించిన విపత్తులో 2100 మందికి పైగా మరణించారని, వేలాది మంది గాయపడ్డారని వివరించారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ నుండి సౌదీ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్, KSR రిలీఫ్ నేతృత్వంలోని సౌదీ రెడ్ క్రెసెంట్ అథారిటీ నుండి బృందాలు సహాయ చర్య, మానవతా కార్యక్రమాలలో పాల్గొనడానికి.. రక్షించడానికి పంపబడతాయని డాక్టర్ అల్-రబీహ్ తెలిపారు.  ప్రపంచవ్యాప్తంగా సంక్షోభాలు మరియు విపత్తులతో బాధపడుతున్న వారికి అండగా నిలవడంలో సౌదీ అరేబియా తనవంతు మానవతా పాత్రను పోషించేందుకు ముందుంటుందని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com