లాంగ్ వీకెండ్.. సెప్టెంబర్ 29 నుంచి మూడురోజుల సెలవులు

- September 11, 2023 , by Maagulf
లాంగ్ వీకెండ్.. సెప్టెంబర్ 29 నుంచి మూడురోజుల సెలవులు

యూఏఈ: మరో రెండు వారాల్లో మూడు రోజుల పాటు ప్రభుత్వ సెలవులు రానున్నాయి. ప్రవక్త ముహమ్మద్ (స) జన్మదినం సెప్టెంబర్ 29న వస్తుంది. ఆ తర్వాత సాధారణ వారాంతం ఉంటుంది కాబట్టి, సెలవులు ఆదివారం వరకు (1 అక్టోబర్ 1) ఉంటుంది.  గల్ఫ్‌తో సహా చాలా ఇస్లామిక్ దేశాల్లో.. ఇస్లామిక్ క్యాలెండర్‌లో మూడవ నెల అయిన 12 రబీ అల్-అవ్వల్ 1445న ప్రవక్త పుట్టినరోజును జరుపుకుంటారు. ఈ లాంగ్ వీకెండ్ తర్వాత సంవత్సరంలో మిగిలిన రెండు సెలవులు డిసెంబర్ 2, 3 తేదీల్లో యూఏఈ జాతీయ దినోత్సవం సందర్భంగా ఉంటాయి.  ఇక వచ్చే ఏడాది లాంగ్ ట్రిప్ ప్లాన్ చేయాలనుకునే వారు 2024 ప్రథమార్ధంలో ఈద్ అల్ ఫితర్ కోసం 9 రోజులపాటు సెలవులను ఆశించవచ్చు. ఖగోళ శాస్త్ర లెక్కల ఆధారంగా ఈద్ ఏప్రిల్ 10, 2024న ఉంటుందని అంచనా. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com