జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ పోషకాహార వారోత్సవాలు

- September 12, 2023 , by Maagulf
జిఎంఆర్ వరలక్ష్మి  ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ పోషకాహార వారోత్సవాలు

హైదరాబాద్: ఆరోగ్యవంతమైన తరాన్ని నిర్మించడానికి అవగాహన మొదటి మెట్టు. జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ (జి.ఎం.ఆర్.వి.ఎఫ్) ఆధ్వర్యంలో జాతీయ పోషకాహార వారోత్సవాలను నిర్వహించి బాలబాలికలకు, మహిళలకు పౌష్టికాహారంపై అవగాహన కలిగించింది. డాక్టర్ రెడ్డీస్ భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న 150 మందికి స్థానికంగా లభించే ఆహారాలు మరియు అనుబంధ పోషకాహారం తినడం యొక్క ప్రాముఖ్యతను తెలీయజెశారు. ఆరోగ్యకరమైన భారతదేశం యొక్క దార్శనికతను నెరవేర్చే ప్రయత్నంలో, జిఎంఆర్విఎఫ్ తన 3 పోషకాహార కేంద్రాలతో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టుపక్కల గ్రామాలలో పోషకాహార అంతరాలను భర్తీ చేసే ప్రయత్నం చేస్తూనే ఉంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com