చంద్రబాబును కలిసిన కుటుంబ సభ్యులు
- September 12, 2023
రాజమండ్రి: రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుని ఈరోజు ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. సాయంత్రం 4 గంటలకు ములాఖత్ కి ఏర్పాట్లు జరిగాయి. ఈ ములాఖత్ కోసం కుటుంబ సభ్యులంతా ముందస్తుగానే రాజమండ్రి చేరుకున్నారు. నారా లోకేష్ రాజమండ్రిలోనే ఉన్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి కూడా రాజమండ్రికి వచ్చారు. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, ఆమె భర్త భరత్ కూడా రాజమండ్రికి వచ్చారు. తొలిరోజు కేవలం ముగ్గురికి మాత్రమే 45 నిమిషాల పాటు మాట్లాడేందుకు అనుమతి ఇచ్చారు. ములాఖత్ నేపథ్యంలో జైలు వద్ద ఆంక్షలు విధించారు. పోలీసులు భారీగా మొహరించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులతో ములాఖత్ నిర్వహించారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్ చంద్రబాబు ని కలిసి పలు విషయాల గురించి చర్చించారు.
ప్రస్తుతం నారా లోకేష్ యువగళానికి కాస్త విరామం ఇచ్చారు. దీంతో ఆయన యువగళం కారవాన్ ను రాజమండ్రిలోనే ఉంచారు. రాజమండ్రి వచ్చిన కుటుంబ సభ్యులు కారవాన్ లోనే విశ్రాంతి తీసుకున్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు







